*బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు*( ఒక వాస్తవ గాథ )
, అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు. బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని తబ్బిబ్బులు పడుతున్నారు. ఇంతట్లో ఒకతను బస్సు టైయర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు. పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది. ప్రయాణికులందరూ దేవ్గడ్ కు వెళ్లేవాళ్ళే. ఒక చేతిన పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలును టికెట్టు తీసుకోమని కండక్టర్ అడుగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది. బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది . వానకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో....? అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో ?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగ