🚩🚩-రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి కధాలోకం !! (కొన్ని కధల పరిచయాలు .)



♦️ఆఖరి దశ !
✍️చరిత్రలోని భిన్న దశలను తీసుకుని విమర్శనాత్మకంగా
వ్యాఖ్యానించిన కధ. శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం.
రాజకీయవేత్తగా అధర్మంగా భీముడితో దుర్యోధనుణ్ణి చంపిస్తాడు.
అర్జునుడితో యుద్దం చేయిస్తాడు.
అధ ర్మంతో అన్యాయకాలం దాపురించిందనుకుంటారు శైవులు.
 శంకరాచార్యు లతో బ్రాహ్మణ మతం నుల్లీ పునరుద్ధరణ పొందింది.
ఇక ప్రపంచానికి చివరి దశే అనుకుంటారు బౌద్దులు.
కాఫర్ల విజృంభణతో, తెల్లవాళ్ల ఆగమనంతో మొగల్‌
సామాజ్యానికే కాదు ప్రపంచానికే ఆఖరి రోజులు వచ్చాయనుకుంటారు
మొగల్‌ రాజ్యం అండతో (బ్రతికినవాల్లు.
భారతదేశంలో తమ రాజ్యం పోవడంతో ఇక ప్రపంచమంతా కుక్కల, నక్కల పాలవుతుందని, ప్రపంచానికి ఆఖరి దశ సమీపించిందని అనుకుంటారు ఇంగ్రీషువాళ్లు.
"ప్రపంచం సాగుతూనే ఉంది ఇన్ని వేలసంనత్సరాలనుంచీ,
ఇన్ని యుగాల నుంచి అన్న వ్యాఖ్యతో కధ ముగుస్తుంది.
♦️ -“కోర్టుకురానిసాక్షులు'
✍️ న్యాయవ్యవస్త స్వరూపాన్ని చిత్రించిన రావిశాస్త్రి మొదటి కధ.
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య తనతో కాపురానికి రావాలని కేసు
వేస్తాడు ఒక మగవాది. తను అసలు పెళ్లాడలేదంటుంది ప్రతివాది.
వాది తరఫున పెల్లి జరిగినట్టు పురోహితుడూ, పెద్ద మనుషులూ సాక్ష్యం ఇస్తారు.
ప్రతివాదికి నిజానికి వాదితో పసెళ్లికాబేదు. ఒక షావుకారు పోషణలో ఉంటూ పిల్లవాణ్ణి కూడా కన్నది ఆ షావుకారు వచ్చి ఈ విషయంలో సాక్ష్యం చెప్పలేదు. తన సాక్షిగా పెల్లి జరగలేదని అగ్ని కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు.
వాదితో కాపురం చేయవలసిందే అని కోర్టువారి తీర్పు.
ఇది ఆమెను వదిలించుకోవడానికి షావుకారు చేసిన
ఏర్పాటు. ప్రతివాది కోర్టునీ, లోకాన్ని, దేవుణ్ణీ బండబూతులు
తిడుతుంది. ప్రయోజనల?
♦️ -కార్నరుసీటు. !
✍️ కార్నరుసీటుకధలో అత్యవసరంగా బయలుదేరి రద్దీగా వున్న
రైలు కంపార్ట్‌మెంట్‌లో కార్నర్‌ సీటు కోసం ప్రయత్నం చేస్తాడు రాజు.
అప్పటికే పచ్చకోటు తాడుక్కున్న ఆసామీ ఒకడు అక్కడ కూర్చుని
ఉంటాడు. రాజు అతణ్ణి గురించి పలు విధాలుగా ఆలోచిస్తూ చికాకు పడుతుంటాడు.
పచ్చుకోటు ఆసామీ మధ్యలో దిగి రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకుంటాడు.
ఒక కూలి మనిషి వెక్కి వెక్కి ఏడుస్తుంటే “నీకతను ఏమౌతాడిని ప్రశ్నిస్తారు జనం.
“ఏమవుతాడు బాబూ? మీకేమవుతాడో నాకూ అదే అవుతాడు.
నిండు ప్రాణమా మరేమన్నానా? పోతే ఏడ్చురాదూ' అని
ఆమె వాళ్ళని అడుగుతుంది
♦️-“మగవాడు ఆడమనిషి.!
✍️జీవితం జంక్షన్‌లో నిలబడి ఎటుపోవాలో తెలియక ఆగిపోయిన మూర్తి కధ
“మగవాడు ఆడమనిషి. ఉద్యోగం కోసం మద్రాసు వచ్చి మేనమామ ఇంట్లో దిగిన మూర్తికి అనుకోకుండా ఒక అమ్మాయి తటస్థపడుతుంది.
ఆమె పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థిని. ఒకసారి ఆమె ఉత్తరం పోస్ట్‌ చేసి,
మరోసారి వెంటాడుతున్న పోకిరీలకు బుద్ధిచెప్పి ఆమెకు సహాయం చేస్తాడు. కృతజ్ఞతగా మూర్తిని ముద్దుపెట్టుకొని అభినందిస్తుంది ఆ అమ్మాయి.
దీనితో తనమీద తనకు విశ్వాసం లేని మూర్తికి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. మేనమామ, మేననూమ కూతురు మూర్తిలో వచ్చిన
మార్పుకి ఆశ్చర్యపోతారు.
♦️-జరీ అంచు తెల్లచీర!
✍️తనకు ఆరేళ్లప్పుడు ఎవరో కట్టుకోగా చూసిన 'జరీ అంచు తెల్లచీరామీద
మోజు కలుగుతుంది విశాలాక్షికి. పదహారేళ్లు వచ్చినా ఇదిగో, అదిగో అని
అమ్మానాన్నలు చెప్పుడమేకాని ఆమె కోరిక తీరదు. సంసారాన్ని కష్టంగా
ఈడుస్తున్న నాన్న సంగతీ ఆమెకు తెలుసు.
తీరా నాన్న కష్టంమీదయినా జరీ అంచు తెల్లచీర కొనడానికి సిద్ధమయినప్పుడు ఇంటి పరిస్థితి, జీవితాల్లోని విషాదాలు జ్ఞాపకం వచ్చి విశాలాక్షి తనకు చీర అవసరం లేదంటుంది.
ఇదీ “జరీ అంచు తెల్లచీరి కధ.
♦️కిటికీ .!
✍️కళ్లు చూడగలవు, కిటికీ చూడలేదు కానీ చూపించగలదు.
 రావిశాస్త్రి ఒకరోజు అమభవం నుంచి వచ్చిన కధ “కిటికీ.
ఊరి చివర, రోడ్డు చివర ఎడమవైపు ఒక పాతడాబా. కుడివైపున
కూలిన పెంకుటిల్లు. అంతా అంధకారం. పాతమేడ కిటికీ
లోపల్నుంచి మాత్రమే వెలుతురు.
రోజూ సాయంగత్రం ఒక ముసలాయన కూలిన పెంకుటిల్లు వరండాలో
కూర్చుని కిటికీ చూపించీ చూపించని జంట జీవితాన్ని
గురించి ఊహించుకుంటాడు.
చితికిపోయిన తన జీవితాన్ని తలచుకుంటున్న
అతనికి కిటికీ స్వప్నాలు చూపిస్తూ ఉంటుంది.
ఒక రోజు చలిగాలికి కిటి తలుపులు మూసుకోనడమూ, నెలుతురు
పోయి ముసలాయన జీవితం ముగిసిపోవడం జరుగుతుంది.
✍️తోటమాలినీ, డైవర్నీ చుట్టూ మూగిన జనాన్ని ముప్పుతిప్పలు సెట్టి కారు
ప్రమాదంలో తోటమాలి చావుకి కారణమైన “నల్లమేకో కధ కొస్త వినోదాత్మకంగా
కనిపించేదే అయినా అందులో ఉన్నత, మధ్యతరగతికి చెందిన రకరకాల జనం మీద రావిశాప్రి ధోరణిలో చెణుకులు చాలా కనిపిస్తాయి.
✍️“గుంటూరు కధలో ఒకే భాషకు చెందినవారిలోకూడా ప్రాంతీయ సంస్కృ
తులు, స్వభావాలలో ఉండే భేదాలు పరస్పర వైషమ్యాలకు కారణమైన తీరుని
రావిశాస్త్రి చిత్రించాడు. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో ఆంధ్ర
విశ్వవిద్యాలయాన్ని నిశాఖసట్నంనుంచి గుంటూరుకు మూర్చారు.
 ఆ సమయంలో చదువు పూర్తి చేసుకోవడానికి గుంటూరు వెళ్తాడు
అప్పుల నరసింహం. అక్కడివాళ్లు విశాఖపట్నం జీవితాన్ని, అలవాట్లని
హేళన చేస్తూ తనను చిన్నచూపు చూడడంతో గుంటూరు మీద
ఘోరమైన ద్వేషం ఏర్పడుతుంది అప్పల నరసింహానికి.
చివరికి బరంపురానికి చెందిన తన భార్య ఆమె తండ్రి
ఉద్యోగరీత్యా గుంటూరులో ఉన్నప్పుడు అక్కడే పుట్టిందని
తెలుసుకున్న అప్పల నరసింహం ఆమెను దూరం చేసుకుంటాడు.
 ఏదో పనిమీద బరంపురం వెళ్లిన రచయిత కటక్‌, బరంపురం ఒరియా సంస్కృతుల మధ్య కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్టు గుర్తిస్తాడు.
 ✍️ఒకే స్కూల్లో చదివే ఇద్దరు కుర్ర స్నేహితుల మధ్య మానసిక స్థాయిలో జరిగే
మైత్రి, ఘర్షణల కధ “ఇద్దరు పిల్లలు”. ఇరవై సంవత్సరాలు ఒక కంపెనీలో
టెపిస్టుగా పనిచేసిన సూర్యం ఆ కంపెనీ మూసివేయడంతో మూడు వందల మైళ్ల దూరంలో దొరికిన ఉద్యోగం కోసం ప్రయాణం చేయవలసి నస్తుంది. ప్రయాణం కోసం సామానులు, పాత కాగితాలు సర్జుకుంటున్న
సూర్యానికి బాల్యం, విద్యార్థి దశ, తన తండ్రి జైలుకెళ్లడం, తన చదువు ఆగిపోవడం మొదలైన జ్ఞాపకాలన్నీ నీడల్లా కదలాడతాయి.
ఇదె న! కధ.
✍️డబ్బుకోసం దేనికైనా సిద్దపడే రానూరావు, మోసాలతో డబ్బూ, ఆస్తీ సెంచుకున్న రామారావు నర్శంమైనంపై సెగల్‌ పొటలు విని పశ్చాత్తాపం చెందడం “సైగలో కధ ఇతివృత్తం.
 సైగల్‌ పాటలకుండే మనసును కరిగించే శక్తిని వర్ణించడానికి,
 సైగల్‌ పాటలపైన తనకుండే అభిమానాన్ని ప్రకటించడానికి రావిశాస్త్రి
ఈ కధ రాసినట్టుంది.
✍️కష్టాలను ఎదుర్కోలేక సన్యాసి అయిన మనిషి నలుగురికి ఆశ్రయమిచ్చి నీడనిచ్చే మర్రిచెట్టును, స్పృహ కోల్పోయిన తనకు ప్రాణం పోసిన కాపుపిల్లని చూచి న్యక్తి విముక్తికన్నా సంఘ విముక్తి ప్రధానమని జ్ఞానోదయం పొంది బుద్దుడైనట్టు చెప్పిన కధ వెలుగు.
 ✍️పెద్దమేడను ఆనుకుని ఉన్న గెస్ట్‌హౌస్‌లో అద్దెకుంటాడు బ్యాంకు గునూస్తా
అవతారం. మేడగలవాళ్లు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో వస్తుంటారు.
అవతారం పెద్దమ్మాయి కమల, తక్కిన పిల్లలు ఇంటిముందు బంతి పూల చెట్టు పెంచుతారు. పూలను వాళ్లు కోయరు. కాని ఒకసారి సెలవులకని వచ్చిన
మేడగలవారి అమ్మాయి పూలన్నీ తెంపుకుంటే చూచి ఊరికే ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతారు అవతారం పిల్లలు. ఇది “పువ్వులు” కధ.
✍️🚩🚩తొలిదశలో '“కోర్టుకురాని సాక్షులు'తోపాటు న్యాయ వ్యవస్థపై రాసిన మరోకధ
“'మూడుస్థలాల్లో.వరుసగా ఆడమనుషులను చంపుతున్న ఒక హంతకుణ్ణి
పట్టుకోవడానికి వ్యభిచార వృత్తిలో పట్టుకున్న ఒక చిన్నమ్మాయిని ఎరగా వేస్తారు పోలీసులు. పులి చిక్కుతుందిగాని ఎరగా వెల్లిన అమ్మాయి దక్కదు. ఆమె మరణ వాజ్మూలంతో సెషన్‌ కోర్టులో హంతకుడికి ఉరిశిక్ష పడుతుంది. తరువాత కస్టడీ నుంచి తప్పించుకున్న హంతకుడు బాగా దెబ్బతిని మళ్లీ పోలీసులకి చిక్కిపోతాడు. అతణ్ణి ఎలాగైనా (బ్రతికించాలని ఇన్‌స్పెక్టర్‌ ఆసుపత్రిలో డాక్టర్ని బతిమిలాడుతాడు. పోలీసు జవాను రక్తం కూడా ఇస్తాడు.
కోలుకొని బాగుపడ్డ హంతకుడికి కోర్టు తీర్పు (ప్రకారం "సెంట్రల్‌ జెయిల్లో ఉరివేస్తారు. అతజ్లీ బతికించిన డాక్టరే అతడి ప్రాణాలు పూర్తిగా పోయాయో లేదో పరీక్షిస్తాడు.
రెండు సనులు “డాక్టరు డ్యూటీగానే చేస్తాడు.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩