🚩🚩-రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి పొట్టి కధలు
(కొన్ని కధల పరిచయాలు .) ♦️వైవిధ్యమైన కథాసాహిత్యానికి వెలిగే సూర్యుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన కథల్లో అక్షరాలకు గొంతులుంటాయి. దృశ్యాలన్నీ వాస్తవికత స్వరాల తో, గాయాలతో ఉన్న బాధల్ని గానం చేస్తాయి. ఆయన కథల్లో పేదరికం కార్చిన కన్నీరు పాఠకుల అరచేతుల్లో దీనమైన రూపమై మిగులుతుంది. నిత్యం అచేతనంగా ఉండే మనిషి ఆలోచనలు ఆయన కథల చైతన్యంతో సరిహద్దు సైనికుల్లా తయారవుతాయి. అసంఖ్యాకమైన కథా సంపదకు దాతగా నిలిచిన రావిశాస్త్రి కలం అందించిన పదునైన సాహితీ భాండాగారం ఈ పొట్టి కథలు. 1979- 1980 ప్రాంతంలో 'స్వాతి' మాసపత్రికలో ప్రచురించబడిన ఈ కథలకు శీర్షికలు ఉండవు, కాని వాటి శిరస్సుల నిండా దట్టించిన సామాజిక ఆలోచన మన చూపుల్ని క్రొత్త మార్గాల వైపు నడిపిస్తుంది. రండి ఒక్కసారి ఆ రహదారుల దృశ్యాలలో మనం ఒక దృశ్యమై కదులుదాం. ♦️పేదరికంతో పస్తులున్న పాక అది. అందులో ఆకలితో ఒక పసికూన అలమటిస్తోంది. బువ్వకోసం అమ్మను, నాన్నను అడిగింది. కన్నీళ్ళతో ఖాళీగిన్నెలు చూపించారు. చేసేదిలేక ఆకలిని భరించలేక 'ఆకలేస్తుంది, బువ్వ పెట్టండని' ఎండిన డొక్కతో ప్రభుత్వాన్ని అడిగింది. మట్టికొట్టుకు పోయిన ఆ ముఖాన్ని చూసి ప్రభుత్