*' (ముళ్ళపూడి వెంకటరమణ ' టీ ' వాలా కథ) పరిచయం:.)

🌷టీ వాలా గురించి బాపు-రమణలు అప్పుడే ఊహించారండోయ్.🤣

🏵️


బేటి వాలా .రోటీ వాలా ...మధ్యలో టీ వాలా ఎలా వచ్చేడో చెప్పే కధ🌷 

(యువ 1964.)

*' (ముళ్ళపూడి వెంకటరమణ ' టీ ' వాలా కథ) పరిచయం:.)

☕   ☕   ☕   ☕   ☕

ఒకూళ్ళో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువులుండేవారు. పదవులకోసం ఇద్దరూ పోటీ పడుతూ ఉండేవారు. ఓసారి మునిసిపల్ ఎలక్షన్ కి ఇద్దరూ పోటీపడి ప్రచారం సాగిస్తుంటే ఇంతలో టీవాలా పోటీలో కి వచ్చాడు.

' నా మీద ఓడితే నువ్వోడాలి తప్ప,ఆడోడితే నాకేం గొప్ప ' అని ఇద్దరికిద్దరూ అనుకుని టీవాలా మీద దండెత్తారు  టీవాలా పోటీనుంచి తప్పుకుని బేటీవాలాతో కలిశాడు.

రోటీవాలా బేటీవాలా లిద్దరూ మళ్ళీ పుంజుకుని పోటీకి సిద్ధపడ్డారు. ఆవేశాలు పెరిగాయి.

బేటీవాలా చివరి రోజున పెద్ద మొత్తంలో నోట్లు జల్లాడు. దానిముందు ఆగలేని రోటీవాలా మౌనంగా ఉండి పోయాడు.

కానీ చివరికి

 *బేటీవాలా ఓడాడు.* *రోటీవాలా గెలిచాడు.*

*టీ వాలా బాగుపడ్డాడు.*

*...ఎలా ?* 

బేటీవాలా నోట్లు పంపకం పూర్తికానిచ్చి పొద్దుపోయా క రోటీవాలా అవన్నీ దొంగనోట్లని పుకారు లేవదీశాడు.

టీవాలా ఇంటింటికీ వెళ్లి ' దొంగనోట్లని పుకారొచ్చిందని పోలీసులొచ్చి పట్టుకుంటారని జనాన్ని భయపెట్టి ఆ నోట్లన్నీ వసూలు జేసుకుని , పది శాతం బేటీవాలా కిచ్చి మిగిలినవి నొక్కేశాడు.

 *టీ వాలా* ఎప్పటికీ జిత్తులమారే.

**************************

_{ముళ్ళపూడి వెంకటరమణ గారి 'సాహితీ సర్వస్వము' మొదటి సంపుటం నుండి.}_

              ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩