🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))
🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450)) 🚩దారితప్పిన యువకులను పాత్రలుగా మార్చి... అంతర్గతంగా వ్యక్తిత్వ వికాసానికి దారిచూపే రచనలు చేసినవారిలో ఆద్యుడు శ్రీనాథుడు. ఆయన గుణనిధి, సుకుమారుడు అనే రెండు పాత్రలను సృష్టించాడు. ఈ వరుసలో అందరికంటే ముందు పుట్టింది ‘గుణనిధి’. అయినా తెనాలి రామకృష్ణుని ‘నిగమశర్మ’కు అధిక ప్రాచుర్యం లభించింది. ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే ‘‘వాడా! వాడు నిగమశర్మ’’ అంటాం. అయితే మన సాహిత్యంలో మదాలసుడు, నిరంకుశుడు, నాగదత్తుడు అనే మరో మూడు భ్రష్ట యువకుల పాత్రలూ కనిపిస్తాయి. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డా చివరికి అప్రయత్నంగా దేవుని మహిమతో మోక్షాన్ని పొందిన ఇలాంటి కథలను తామస కథలు అంటారు. వాటిలో మొదటిది ‘గుణనిధి కథ’. ఇది శ్రీనాథుడు రచించిన ‘కాశీఖండం’లోనిది. పేరుకు పెద్దన్న... 🚩కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడే గుణనిధి. చాలా అందగాడు. కానీ, చదువు వదిలిపెట్టి పేకాట నేర్చాడు. విటులతో స్నేహం పెంచుకొన్నాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం, గీత వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడిపందేలు, పాచికలాటల్లో ఆ