🚩🚩ముద్దపప్పు.🚩🚩





♦వేయించిన కంది పప్పు తో ఉడికించిన ముద్ద పప్పు కేవలం

మానవ జాతి కి మాత్రమే తువరీదేవీ మాత ప్రసాదించిన అద్భుత వరం.

♦పూర్వం దేవలోకము నుండి, దేవతలూ, యక్షులూ, కిన్నెరులూ,

గంధర్వులూ భూలోకమునకు తరచూ వేంచేసి, నాలుగు దినములు ఈ ముద్దపప్పు అన్నము గోఘ్రుతము తో సహా భోంచేసి వెళ్ళెడి వారని మిధున పురాణము ఉటంకించుచున్నది! దేవలోకమునందలి అప్సరసలకు సైతము ఈ వేయించిన ముద్ద పప్పన్నము ఆవు నెయ్యి తో పాటు, ఆమ్రోరగాయము తో సహా భుజించుటయన్న అత్యంత సరదా మరియూ మోజూ అని పేర్కొనబడినది!

♦విశ్వామిత్రుని ఘోర తపోభంగము నిమిత్తము భూలోకమునకు వేంచేసిన మేనకా సాధ్వీమణియునూ, ఆ తపోభంగ కార్యక్రమమునకు ఉపక్రమించు ముందు ఈ ముద్ద పప్పన్నం పుష్కలము గా ఆరగించిన పిదపయే, విశ్వామిత్రుని ముందు తన శ్రుంగార జావళీ నృత్యము ఆరంభించి 7 పగళ్ళూ రాత్రులూ నృత్యించి కార్యము సాధించెనని కూర్మ పురాణం ఉవాచ!

♦కార్యము సిద్ధించిన సంతసమున , మేనకా సతీమణి ముద్దపప్పు నకు ఒక దివ్య వర ప్రసాదము కావించినది! అది ఏమన, ముద్ద పప్పు అన్నమునకు అనుపానములు గా సర్వ పచ్చళ్ళూ, సర్వ పులుసులూ తూగగలవని ఇచ్చిన వరము!

♦ఏది ఏమైననూ, ముద్ద పప్పు అనునది భోజనప్రియులకు గొప్ప అదృష్టమూ మరియూ సద్భాగ్యమూ !

ఈ మధ్యాహ్న భోజనమున, నాకు సైతమూ, నా ధర్మ పత్ని ముద్దపప్పు చేయవలెనని సంకల్పించడంతో నాకీ ముద్దపప్పు చరిత్ర జ్ఞప్తికి వచ్చినది! అదనమాట

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!