🌷కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా!😡



👉నిజంగా కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.

జగన్నాటక సూత్రధారి ముందు ఎవరి నాటకాలు మాత్రం

చెల్లుతాయి చెప్పండి.

ఈ విషయాన్ని మన తిమ్మన్నవారు బాగుగా గ్రహించారు.

అందుకే.... పారిజాత పుష్పం విషయంలో... శ్రీకృష్ణున్ని తన్నే

దాకా వచ్చింది మన సత్యభామ. ఆ వెంటనే శ్రీకృష్ణుడి చేత

ఈ పద్యం చదివించారు...

..

నను, భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా

చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే

ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!

.

"నేను నీ దాసుణ్ణి. నీవు ప్రణయకోపముతో తన్నటం కన్నా,

నేను కోరుకోదగిన భాగ్యం యేముంటుంది చెప్పు?

ఇదిగో గగుర్పొడిచి నా శరీరం యెలా ముళ్ళపొదలా వుందో చూడు.

ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో! ఇంకేమైనా వుందా!

మెత్తని నీ పాదాలు గాయపడవూ! అందుకే యింతసేపటినించీ

బతిమాలుకుంటున్నాను. అలకమాను" అని ఈ పద్యం అర్థం.

.

అంత వరకూ బాగానే ఉంది. చివర్లో అరాళ కుంతలా... అంటూ

సంభోదింపజేశారు.

అసలు ఇక్కడ సన్నివేశం ఏంటి.... ఈ సమయంలో...

దట్టమైన కురులు కలదానా....

అని సంబోధించాల్సిన అవసరమేంటి....

అక్కడే ఉంది కిటుకంతా.

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని...

కాళ్ళు అందబుచ్చుకున్న కన్నయ్య....

జుట్టు అందుకోవడానికి బయలు దేరాడు అన్నదే

ఈ పద్యంలోని అంతరార్ధం.

అన్నన్నా.... కన్నయ్య ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చెయ్యకపోతే....

పదియారు వేలమంది గోపికలతో... అష్టభార్యలతో వేగి ఉంటాడో కదా...

         🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🙏🙏

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!