🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐



♥️శివ అనే మాటకు శుభం అని అర్ధం.

శివున్ని సాధారణంగా లింగ రూపంలోనే కొలుస్తారు. అలాగని శివమూర్తులు లేవని కాదు.

శివుడి లింగ రూప, విగ్రహా రూప విధానాలేమిటో చూద్దాం.

♥️శివలింగాలు.💐

1) దైవికాలు: దివ్య శక్తులున్నవి.

కేదారినాథ్,.

కాశీ,

రామేశ్వర మొ" చోట్ల ఇవి ఉన్నాయి.

2) ఆర్షకాలు :బుుషుల చే పూజింపబడేవి.

3) బాణాలు: శివుడు బాణుడనే రాక్షసుడిని సంహరించగా అతని శరీర భాగాలు గంగ, నర్మదా మొ" నదులలో పడినవి. అవే శివలింగాలైనవి.

4) మానుషాలు : మానవులచే నిర్మించబడినది.

♥️ఇక శివ ప్రతిమలు / విగ్రహాలు.!💐

శివప్రతిమలు స్థానక(నిలుచున్న) భంగిమలోను,

ఆసిన (కూర్చున్న), మరియు

అనుగ్రహామూర్తి సంహారమూర్తి మొ॥భంగిమలలో కలవు.

♥️స్థానక శాంత మూర్తులు.💐

1 లింగోద్భవమూర్తి :

లింగం నుండి శివుడు జన్మించాడు. నాలుగు హస్తాలు, పైచేతులలో గొడ్డలి, జింక ఉంటాయి. మోకాలు క్రింది భాగం లింగం లో కలిసినట్టు ఉంటుంది.

2 చంద్రశేఖర మూర్తి :

శిరసుపై చంద్రుడు ఆభరణంగా ఉంటాడు.

శివుడు ఒంటరిగా ఉంటే కేవల మూర్తి అని,

పార్వతి తో ఉంటే ఉమామహేశ్వర మూర్తి అని అంటారు.

ఒక చేతిలో జింక, మరో చేతిలో గొడ్డలి లేదా ఢమరకం ఉంటాయి.

క్రింది చేతులు అభయ, వరద (కోరికలు తీర్చే భంగిమ ) రూపంలో ఉంటాయి.

జటా మకుటం లో అర్ధ చంద్రుడు ఉంటాడు.

3 పాశుపత మూర్తి :

ఈ విగ్రహం చంద్రశేఖర మూర్తి లాగే ఉంటుంది.

అయితే క్రింది చేతులలో త్రిశూలం, అక్ష మాల ఉంటాయి. నిత్య ఉత్సవాలకు ఈ పాశుపత మూర్తి విగ్రహాలను ఉపయోగిస్తారు.

ఆసీన మూర్తులు.💐

1 సుఖాసీన మూర్తి.

భద్రపీఠంపై ఎడమ కాలు ఉంచి సుఖంగా కూర్చున్నట్లు ఉంటుంది.

పై చేతులలో పరుశువు, మృగం ఉంటాయి.

2 ఉమాసహితమూర్తి.

సుఖాసీనుడైన శివునికి ఎడమవైపున పార్వతి కూర్చుని ఉంటుంది.

శ్రీవారికి రెండు చేతులుంటాయి.

ఒక చేతిలో ఉత్పల పుష్పం మరో చేయి సింహ కర్ణ పద్ధతిలో ఉంటుంది.

శివుడు వృషభం వాహనంగా ఉంటాడు.

ఈ రూపాన్నే వృషభారూఢ ఉమా సహిత మూర్తి అని అంటారు.

3 సోమ స్కంద మూర్తి :

ఇది అతి ప్రాచీనరూపం.పీఠంపై కూర్చుని ఉన్న శివపార్వతుల మధ్య స్కంద / కుమారస్వామి ఉంటాడు.

కుమారస్వామి ఒక పక్క కూర్చుని లేదా నిలబడి లేదా పార్వతి తొడపై కూర్చుని ఉంటాడు.

4 ఉమామహేశ్వర మూర్తి :

ఈ విగ్రహం...పై దాని లాగే ఉంటుంది.కాకపోతే

కుమార స్వామితో పాటు గణపతి కూడా ఉంటాడు.

♦️అనుగ్రహామూర్తులు :💐

1 చండీశానుగ్రహ మూర్తి

చండిసుని అనుగ్రహిస్తున్న రూపం ఇది.

ఆ సీనులై శివపార్వతులుంటారు.

శివుడి కుడిచేయి వరద ముద్రలోనూ ఎడమ చేయి చండీసుని తలను పట్టుకొని పూలమాల వేస్తున్నట్లు ఉంటుంది.

2 విష్ణు అనుగ్రహమూర్తి :

విష్ణు భగవానుడు శివుడి వద్ద నుండి సుదర్శన చక్రాన్ని పొందినాడు.

విష్ణువు శివుడి వద్ద నుండి చక్రం పొందుతున్నట్లుగా

ఈ రూపం ఉంటుంది.

3 నందీశానుగ్రహమూర్తి :

శివవాహనమైన నందికి మరణం తనకు వస్తుందని తెలుస్తుంది.

అపుడు నంది తనకు శివుని సేవచేసుకొనే భాగ్యం కల్గించాలని కోరుకొన్నాడట.

శివుడు నందికి శాశ్వత జీవితం ను ప్రసాదించాడు.

నంది శివపార్వతుల వద్ద నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది.

4 విఘ్నేశ్వరానుగ్రహమూర్తి :

వినాయయకుడికి ఏనుగు తల అమర్చిన తరువాత శివపార్వతుల నుండి ఆశీర్వాదం పొందుతున్నట్లుగా

ఈ రూపం ఉంటుంది.

5 కిరాతార్జున మూర్తి :

శివుడు అర్జునినికి పశుపతాస్త్రం ప్రసాదించునట్లుగా

ఈ విగ్రహం ఉంటుంది.

శివుడి నాలుగు చేతులలో , పై చేతులలో మామూలు ఆయుధాలు క్రింది ఎడమ చేయిలో ధనస్సు కలిగి ఉంటాడు.

పార్వతి దేవి కూడా ఉంటుంది.

అర్జునుడు వీరి ఎదురుగా తపస్సు చేస్తూ ఉంటాడు.

6 రావణానుగ్రహమూర్తి :

రావణుడు కైలాసాన్ని కదిలించబోగా పార్వతి భయపడి శివుడిని కౌగలించుకొని పడిపోకుండా పట్టుకొమ్మని కోరింది.

శివుడు కైలాసాన్ని కుడికాలితో తోక్కి పట్టగా రావణుడు పర్వతం క్రింద చిక్కాడు.

రావణుడపుడు శివుడిని తన సామగానంతో పరవశింపచేశాడు.

శివుడు ఆనందించి రావణుడిని ఆశీర్వదించాడు. శివపార్వతులున్న పర్వతం క్రింద రావణుడు పది తలలు ఇరవై చేతులు కలిగి ఉంటాడు.

ఒక చేతిలో వీణ ఉంటుంది.

శివుడి చుట్టూ భూతగణం ఉంటుంది.

♥️సంహరమూర్తులు.💐

♦️1కామాంతక మూర్తి :

శివుని తపస్సును మన్మధుడు భంగం చేయ ప్రయత్నిస్తే శివుడి మూడవ నేత్రం తో తీక్షణ చూపుతో మన్మధుని భస్మం చేసే రూపు ఇది.

తీక్షణ చూపులతో శిరసుపై జటా మకుటంతో నాలుగు చేతులలో అక్ష మాల, మొ"నవి ఉంటాయి.

♦️2 గజసంహరమూర్తి :

ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడ నే రాక్షస సంహార రూపం ఇది.

శివుడు నాట్య భంగిమలో ఉంటాడు.

ఒక చేతిలో ఏనుగు దంతం ఉంటుంది.

కపాలం, ఘంట ఇతరచేతులలో ఉంటాయి.

♦️3 కాలారి మూర్తి :

తన భక్తుడైన మార్కేండేయుని సంహరించాడానికి వచ్చిన యముడిని లింగం నుండి ఉద్భవించిన శివుడు కుడి కాలిని లింగం పై ఉంచి ,ఎడమ కాలు యముడి హృదయం పై ఉంటుంది.

తీక్షణమైన చూపుతో వెనుక చేతిలో ఉన్న త్రిశూలం యముడికి గురి పెట్టబడి ఉంటుంది.

పై ఇంకో చేతిలో గొడ్డలి ఉంటుంది.

త్రినేత్రాలు కలిగి ఉంటాడు.

♦️4 త్రిపురాంతక మూర్తి :

త్రిపురాలను కేంద్రంగా ఉన్న ముగ్గురు రాక్షసులను సంహరించే రూపం ఇది.

బ్రహ్మ రథసారథి గా శివుడు త్రిపురాసురులను ఏకకాలంలో సంహరించాడు.

ఈ రూపంలో శివుడు ఎడమ కాలు వంచి విలుకాని వలె ఉంటాడు.

కుడిచేతిలో బాణం ఉంటుంది.

పై చేతులలో గొడ్డలి / జింక jఉంటాయి.

♦️5 శంభమూర్తి.

నరసింహ అవతారం లోని క్రూర స్వభావాన్ని అణచటానికి శివుడు శంభమూర్తి గా పుట్టాడు.

సింహం తల ,మూడు కాళ్ళు, నాలుగు చేతులు, పొడవైన తోక గల వింత ఆకారం ఇది.

ముందు కాలు నరసింహ మూర్తి వైపుకు ఉంటుంది.

శ్రీశైల మల్లికార్జున ఆలయంలో ఇలాంటి శిల్పం ఉంది.

♦️6 బ్రహ్మశిరచ్చేదమూర్తి.

దక్ష యజ్ఞానికి బ్రహ్మ పౌరోహిత్యం వహించాడని కోపంతో శివుడు , బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించగా ,

ఖండిత శిరసు శివుడి అరచేతిలో అతుక్కొనిపోగా కాందియుారు అనే చోట శివుడు తపస్సు చేస్తే

పరిహారం లభిస్తుందని విష్ణువు చెప్పగా శివుడు

ఆ విధంగానే పాపపరిహారం పొందాడు.

ఈ శిల్పంలో శివుడి కుడి చేతిలో బ్రహ్మ 5వ తల ఉంటుంది.

♦️7 భైరవమూర్తి.

భైరవ మూర్తి ప్రపంచ రక్షకుడు.

రౌద్రాకృతి,భయంకర రూపం.కళ్ళు బైటకు పొడుచుకొని వచ్చి ఉంటాయి.

పళ్ళు(teeth) పెదవులు దాటి బైటకు జోచ్చుకొని వచ్చి ఉంటాయి.

సర్పాల, పుర్రెల హారాలు మొ॥విచిత్ర ఆభరణాలు ఉంటాయి.

శిరోవెష్టనం కూడా పుర్రెలు కలిగి ఉంటుంది.

భైరవ మూర్తి విగ్రహాలు 64 రకాలు.

ప్రతి శివాలయంలో ఈ మూర్తులు ఉంటాయి..

♦️8 వీరభద్రమూర్తి.

దక్ష యజ్ఞ సమయంలోని రౌద్రాకార రూపం ఇది.

మెడలో పుర్రెల హారం ఉంటుంది.

4 లేదా 8 చేతులలో భయంకర ఆయుధాలు కలిగి ఉంటాడు.

♦️9 జలంధర మూర్తి.

చాలా అరుదైన రూపం.

జలంధరుడనే రాక్షసుడిని సంహరించే మూర్తి ఇది. నిలబడి ఉంటాడు.

రెండు చేతులుంటాయి.

ఒక చేత కమండలం మరో చేత గొడుగు ఉంటుంది.

తల జుట్టు చిందరవందరగా ఉంటుంది.

అందులో అర్ద చంద్రుడు, గంగ ఉంటారు.

♦️10 అఘొర మూర్తి.

అఘొర మూర్తి అశుభానికి చిహ్నం అని అంటారు.

అందుకే ఈ మూర్తులు చాలా అరుదు.

బయటకు వచ్చిన పెద్ద పళ్ళు, పాముల, పుర్రెల దండలుoటాయి.

జటామకుటంలో అగ్ని ఉంటుంది. రౌద్రరూపం.

♦️నటరాజ రూపం.💐

సృష్టి, స్థితి, లయ కారకుడై శివుని నాట్య రూపం..

నటరాజ రూపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

♦️(1)ఆనంద పరవశ తాండవ రూపమే మనకు బాగా పరిచయమున్న మూర్తి.

4 చేతులు ఉంటాయి.

నిలబడిన రూపం.

అపస్మార లేదా వనియులకుడనే రాక్షసుని మీద శివుడు నాట్యం చేస్తుంటాడు.

(2) సాధ్యతాండవం.. ఇందులో రాక్షసుడి మీద తాండవం ఉండదు.

(3) ఉమా తాండవం.పార్వతి / ఉమ శివుడికి ఎడమవైపున ఉంటుంది.

(4) గౌరీ తాండవం.ఈ భంగిమలో కుడివైపున నంది ఉంటాడు.

(5) కాళికా తాండవం.కాళికలా భయంకర తాండవ మూర్తి.

(6) త్రిపుర తాండవం.ఈ రూపానికి 16 చేతులు ఉంటాయి

(7) సంహార తాండవం.చూపులు భయంకరంగా ఉంటాయి.

(😎 లలిత తాండవం.శివ తాండవ రూపం సున్నితంగా, మృదువుగా ఉంటుంది.

(9) ఉర్ద్వ తాండవంలో 16 చేతులలో రకరకాల ఆయుధాలు ఉంటాయి.

♥️శివుడి ఇతర రూపాలు.💐

♦️1) దక్షిణామూర్తి. బుుషులకు బోధ చేసే రూపం.

♦️(2) కంకాళమూర్తి.బ్రహ్మశిరసును ఖండించిన శివుడు దేశదిమ్మరి రూపం.

♦️(3) బిక్షాటనమూర్తి.తారకారణ్యంలో నగ్నంగా సంచరించిన రూపం. కాళ్ళకు చెప్పులుంటాయి.

♦️(4) అర్ధనారీశ్వర రూపం.సగం స్త్రీ, సగం పురుష రూపం

(♦️5) హరిహర మూర్తి. శరీరం సగం శివరూపం మిగిలిన సగం విష్ణురూపం. ఇద్దరికి తేడా లేదనే భావం.

♦️(6)కళ్యాణసుందరమూర్తి.పార్వతిదేవిని వివాహమాడే రూపం.

♦️(7) వీణా ధర రూపం.శివుని అద్భుత రూపం. ముందుచేతులతో వీణ వాయిస్తూ ఉంటాడు.

(😎 వృషభా రూఢ రూపం.శివుడు కవృషభంపై ఆసీనుడైన రూపం ఇది.

🕉ఓం నమః శివాయ..!🙏

లోకా సమస్తా సుఖినోభవంతు..!💐

💐శ్రీ మాత్రే నమః💐

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴