🔴🧤-పంచాంగ శ్రవణం .-🧤 ❤️💕 ఒక గొప్ప సామాజిక ఉత్సవం. 💕❤️


🔴🧤-పంచాంగ శ్రవణం .-🧤

❤️💕 ఒక గొప్ప సామాజిక ఉత్సవం. 💕❤️

(చిత్రం ..బాపు..)

♥️తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు అంగాలు

కలిగిన కాలజ్ఞానాన్నే పంచాంగం అంటారు. ఒకప్పుడు ఈ పంచాంగం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఉన్నా దాన్ని ఎలా చూసుకోవాలో ఎవరికీ తెలియదు. అందుకని గ్రామంలోని పురోహితుల వద్దకు ఊరిజనమంతా చేరేవారు.

♦️గ్రహగతులు బట్టి ఒకోరాశి వారి స్థితిగతులు ఎలా ఉంటాయో

పురోహితులు వివరించేవారు.

అయితే వ్యక్తిగతమైన జాతకాన్ని వివరించడంతో పంచాగం ముగిసిపోదు.

♦️వచ్చే ఏడు వర్షాలు ఎలా పడతాయి? పంటలు ఎలా పండుతాయి? దేశంలోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి?

♦️శుభకార్యాలకు అనువైన సమయాలు ఏమిటి?

ఈసారి అధిక మాసం ఎప్పుడు వచ్చింది?... లాంటి సవాలక్ష విశేషాలతో

నిండి ఉంటుంది.

♦️అలా పంచాంగం... వ్యవసాయం, రాజకీయం, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటినీ ప్రతిబించేదిలా ఉంటుంది. పైగా పంచాంగ శ్రవణంలో అందరూ ఒక చోటకి చేరడం ఒక గొప్ప సామాజిక ఉత్సవం.

♦️ఇక పురోహితుల వారి నుంచే అప్పటికప్పుడు సందేహాలను

తీర్చుకుంటూ, చేయవలసిన పరిహారాలను తెలుసుకుంటూ

కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చక్కటి అనుభూతి.

♦️అందుకే పంచాంగ శ్రవణం చేసిన వారికి నవగ్రహాలూ సకల

సౌఖ్యాలనును అందిస్తాయని అంటుంది ఫలశ్రుతి.

🔯🔯🔯🔯🔯🔯 🔯🔯🔯🔯🔯 🔯🔯🔯🔯🔯🔯

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)