🖤🖤కలి వినాశనం !🖤🖤

 


♦️ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడట కలి పురుషుడు. ఇక ద్వాపర యుగం అంతరించి ఇక కలి ప్రవేశించి, కలియుగం ఆరంభమవుతున్న దశ అది. పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న కాలమది. 

♦️ఓసారి ఆయనకు గోమాత ఏడుపు వినిపించింది. ఆమె పక్కనే ఒంటి కాలితో ఉన్న ఎద్దు ఎందుకేడుస్తున్నావని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. వారిద్దరి దగ్గరికి వెళ్లిన పరీక్షిత్ మహారాజు కూడా ఆ గోవును కారణమేమిటని అడిగాడు. కలి ప్రవేశించబోతున్నాడు. కాలము మారడంతోనే ఈ ధర్మానికి మూడు కాళ్లూ పోయి, చివరికి ఒక్క కాలే మిగిలిందని ఏడుస్తున్నానంది. 

అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికీ అవసరం లేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగేదానవు. ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు? వాడెవడైనా సరే.. భుజాలు విరగ్గొడతాను అన్నాడు. కాలక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు. నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు.

 ♦️కలిపురుషునిపై కోపోద్రిక్తుడైన పరీక్షత్తు కాళ్లపై పడ్డాడు కలి పురుషుడు.

ఇది కలియుగం కాబట్టి నేను రావాలి కదా! ఇది వదిలి నేనెక్కడుండాలి? నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు కలి. సరే.. 

♦️జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు .

పరీక్షిత్తు. తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి

 వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడాయన. 

కాని రాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ 

జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, 

అహంకారం, వ్యభిచారం నుంచి కామము,

 హింస నుంచి కోపం, క్రౌర్యం.. ఇలా మరో నాలుగు స్థానాలను 

కూడా కలి ఆక్రమించాడు. 

ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. 

అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి

 ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి 

♦️పురుషుడు. ఇందులో ఏ ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా వారిపై కలి ప్రభావం మొదలై అన్ని రకాలుగా భ్రష్టులవుతారు.

 అక్కడ సిరిసంపదలు గాని, భగవంతుడు గాని ఉండరు.

 దాంతో వాళ్లు పూర్తిగా కలి నియంత్రణలోకి వెళ్లి నశించిపోతారు. అందుకే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని అందుకే చెబుతారు పెద్దలు.

♦️బంగారం.. పరీక్షిత్తు.. కలి!

♦️ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. 

పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారు ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరమృగాల బాధ 

తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది.

 జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. 

♦️శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనై మరణాన్ని కొనితెచ్చుకుంటాడు.

♠️♠️♠️♠️♠️♠️♠️♠️♠️♠️                                   ♠️♠️♠️♠️♠️♠️♠️♠️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)