# ***❤సాంధ్యశ్రీ..(కరుణశ్రీ)*** # ***రచన : కరుణశ్రీ*** # ***సంగీతం : ఘంటసాల***
# ***❤సాంధ్యశ్రీ..(కరుణశ్రీ)***
# ***రచన : కరుణశ్రీ***
# ***సంగీతం : ఘంటసాల***
# ***గానం : ఘంటసాల***
# ***అది సంధ్యా సమయం.***
# ***మల్లె పందిరి పూస్తున్నది.***
# ***కోయిల కూస్తున్నది.***
# ***కవి కుమారుడు కరాలు చాచి,***
# ***కరుణామయుని లాలిస్తున్నాడు.***
# ***01)|| ఉత్పల మాల ||***
# ***అంజన రేఖ , వాల్ కనుల - అంచుల దాట , మనోఙ్ఞ , మల్లికా***
# ***కుంజములో , సుధా, మధుర - కోమల , గీతిక లాలపించు , ఓ***
# ***కంజదళాక్షి !నీ , ప్రణయ - గానములో , పులకింతునా !! మనో***
# ***రంజని ! పుష్ప వృష్టి పయి - రాలిపి , నిన్ , పులకింప జేతునా!!!***
# ***02)|| ఉత్పల మాల ||***
# ***క్రొంజికురాకు వ్రేళుల,కు - రుల్,తడి యార్పుచు గూరుచున్న, అ***
# ***భ్యంజన మంగళాంగి , జడ - లల్లుదునా ! మకరంద , మాధురీ***
# ***మంజుల , మామక , ప్రణయ - మానస భావనలే , ప్రపుల్ల పు***
# ***ష్పాంజలి జేసి ,నీ అడుగు - లందు , సమర్పణ జేసి కొందునా!***
# ***03)|| ఉత్పల మాల ||***
# ***ఓ.......ఒ..ఒ..ఓ...........ఒ...ఒ...ఓ.....***
# ***సంజ వెలుంగులో , పసిడి - ఛాయల , ఖద్దరు చీర గట్టి, నా***
# ***రింజకు నీరు వోయు ,శశి - రేఖవె నీవు ! సుభద్ర సూతినై***
# ***రంజిత పాణి పల్లవము - రాయుదునా !! నిను మౌళి దాల్చి, మృ***
# ***త్యుంజయ మూర్తినై ,జముని - తో, తొడ గొట్టి , సవాలు చేతునా!!***
# ***సాంధ్యశ్రీ పద్య ఖండిక***
# ***గణ యతి ప్రాసలతో కూడిన పద్యం తెలుగు వాడి సొత్తు. సంస్కృతంతో సహా ఏ భాషా ఛందస్సులో లేని సొగసు తెలుగు పద్యానిది. తెలుగు పద్యానిది వెయ్యేళ్ళ చరిత్ర. ఈ వెయ్యేళ్ళలో తెలుగు పద్యం ఎన్నో పోకడలు పోయింది. నన్నయదొక పోకడ, తిక్కనదొక పోకడ, శ్రీనాథుని దొకటి, పోతనదొకటి, పెద్దనది మరొకటి.***
# ***ఆకాశమార్గాన అందనంత దూరాన విహరించే తెలుగు పద్యాన్ని నేల మీదికి లాక్కొచ్చి, ప్రతి పల్లెటూరిలో ప్రతి నోట పలికించిన ఘనత తిరుపతి వేంకట కవులది. కాగా, తెలుగు పద్యాన్ని హుమాయిలా, రుబాయిలా పరువెత్తించిన నేర్పు జాషువాది. వారి తర్వాత అంతగాను, అంతకన్నా మిన్నగాను పద్య కవితను ప్రజల మధ్యకు చొచ్చుకుపోయేటట్టు చేసి ఔననిపించుకున్నవారు కరుణశ్రీ.***
# ***సొగసైన తెలుగు పద్యాన్ని సొంతం చేసుకున్న మహనీయ కవి కరుణశ్రీగా తెలుగు నెల నాలుగు చెరుగుల పేరుపడిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. పద్య విద్యనూ పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన కవిశేఖరుడు పాపయ్య శాస్త్రి గారు. తెలుగు పద్యాన్ని ఎంత రమ్జుగా, రమ్యంగా, సరళంగా, మధురంగా, శ్రవణసుభగంగా నడిపించడానికి వీలుందో అంతగాను నడిపించిన ఘనత పాపయ్య శాస్త్రి గారిది.***
# ***నాలుగు, నాలుగున్నర దశాబ్దాల నాడు, కరుణశ్రీఏ ఒక కవితలో “సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి”గా కీర్తించిన ఘంటసాల .***
# ***♦అంజన రేఖ వాల్కనుల యంచులదాటి మనోజ్ఞ మల్లికా***
# ***కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ***
# ***కంజ దళాక్షి, నీ ప్రణయ గానములో పులకింతునా మనో***
# ***రంజని బుష్పవృష్టి పయి రాల్పి నినున్ బులకింప జేతునా🌹***
# ***.***
# ***♦క్రొంజిగురాకు వేళుల కురుల్ తడియార్పుచు గూరుచున్న య***
# ***భ్యంజన మంగళాంగి జడలల్లుదునా, మకరంద మాధురీ***
# ***మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రపుల్ల పు***
# ***ష్పాంజలి జేసి నీ యడుగులందు సమర్పణ జేసికొందునా🌹***
# ***.***
# ***♦సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నా***
# ***రింజకు నీరు వోయు శశిరేఖవె నీవు సుభద్ర సూతినై***
# ***రంజిత పాణి పల్లవము రాయుదునా నిను మౌళి దాల్చి మృ***
# ***త్యుంజయ మూర్తినై జమునితో తొడ గొట్టి సవాలు చేతునా, 🌹***
# ***🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻***
Comments
Post a Comment