🚩 ఏమి రామ కథ శబరీ, శబరీ🙏🏿 (దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం.!)
🔻🚩 ఏమి రామ కథ శబరీ, శబరీ🙏🏿
(దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శబరి....బాపు చిత్రం.!)
👉🏿భగవంతుని కృప కోసం ఆర్తితో అర్థించే భక్తురాలి
విన్నపంలో జాలి ఉంది. అందులో కవి హృదయ నివేదన దాగుంది.
అలాగే రామాయణ కావ్య గొప్పతనం అతి సులభంగా చెప్పిన
ఈ పాట చూస్తే మనసు కరుణ ప్రాయంగా మారుతుంది.
❤ ఏమి రామ కథ శబరీ, శబరీ
ఏదీ మరియొక సారీ
ఏమి రామ కథ – రామ కథా సుధ
ఎంత తీయనిదీ శబరీ – శబరీ ❤
|| ఏమి రామ కథ ||
♦ భక్త శబరి చిత్రంలో ఈ పాటలో రెండు దృశ్యాల చిత్రీకరణ దాగి ఉంది.
శబరి రాముడికి ఎంగిలి చేసిన పళ్ళని సమర్పిస్తే –
“అవి ఎంతో తీయగా ఉన్నాయి, ఏదీ మరియొక సారీ ” అంటూ
అవి తినే రాముడు కనిపిస్తాడు. రామ దర్శనం కోసం ఎదురు తెన్నులు
చూసిన శబరి ఆనందం కనిపిస్తుంది. ఇది ఒక చిత్రం.
రెండోది.
♦రామా కథా మృతం – ఎన్ని సార్లు తాగినా దాహం తీరదు
. ఇంకా ఆ సుధని సేవించాలానే మనసు ఉవ్విళ్ళూరుతుంది.
ఇలా రెండు దృశ్యాల్ని నాలుగు వాక్యాల్లో కమనీయం గా
చుట్ట గలిగిన ప్రతిభ ఈ పాటలో కనిపిస్తుంది.
♦సంపూర్ణ రామాయణం సినిమాలో
“అదిగో రామయ్యా – ఆ అడుగులు నా తండ్రివి..” పాటలో
రాముడి రాక కోసం పరితపించే శబరి ఆత్రుతని
ఎంతో కమనీయంగా రాసారు.
♦ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది.
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది.
ఎందుకో – ఎందుకో – ప్రతీ పలుకూ ఏదో చెప్పబోతుంది.
వనము చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది.
ఉండుండీ నా వళ్ళు ఊగి ఊగి పోతుంది.
అదిగో రామయ్య – ఆ అడుగులు నా తండ్రివి,
ఇదిగో శబరీ శబరీ వస్తున్నదీ
♦రాముడొస్తాడన్న ఆశతో జీవించే శబరికి
ఆయన రాక ముందుగానే ప్రకృతిలో కనిపించింది.
రాముని రాక శబరికే కాదు, ఆ వనానికి కూడా సంతోషమే!
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Comments
Post a Comment