🚩🔻విజయ విలాసము.🔻🚩








(చిత్రం - వడ్డాది పాపయ్య గారు ..సుబద్రార్జునులు .)


#విజయవిలాసం కావ్యాన్ని #చేమకూర వెంకటకవి రచించారు.

ఈయనను వెంకన్న, వెంకటయ్య అని వ్యవహరించేవారు.

#విజయుడు అనగా అర్జనుడు. అతడి విజయగాధను తెలిపేది కనుక ఇది విజయవిలాసం అనబడినది. ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, #ఉలూచి, #చిత్రాంగద, #సుభద్ర లు.

విజయ విలాసంలో కథ భారతంలోనిది.

బ్రాహ్మణ గోసంరక్షణార్థం, విల్లంబుల కోసం అర్జునుడు ధర్మరాజు అంతఃపురం వైపు వెడతాడు. ఆ ఏడాది ద్రౌపదీదేవి ధర్మరాజు సన్నిధిని ఉంది. నియమం ప్రకారం అర్జునుడు అటు వెళ్లకూడదు. కానీ పరాకున వెళ్ళాడు.

దానికి ప్రాయశ్చిత్తంగా భూప్రదక్షిణకు బయలుదేరాడు. తోడుగా విశారదుడనే నర్మసచివుడు కూడా వెళ్ళాడు. గంగానది యొక్క పరివాహక ప్రాంత పుణ్యక్షేత్ర సంధర్శనలో ఉలూచి అనే నాగకన్య అతడిని మోహించి తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళడం వారిరివురకూ #ఇలావంతుడు జన్మించడం, తదనంతరం పాండ్యరాజ్యం సంధర్శనలో మలయధ్వజ మహారాజు కూతురు అయిన #చిత్రాంగధను వివాహమాడి #బబ్రువాహనుని కని అతడిని మామగారికి దత్తతివ్వడం, తర్వాత ద్వారక సంధర్శనలో శ్రీకృష్ణుని చెల్లెలు #సుభద్రనీ వివాహమాడడం ఇదీ కావ్యంలోని ఇతివృత్తం

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!