🚩తుంబురుడు! 🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻



♦తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు.

👉🏿పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు.

👉🏿 వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు కళావతి అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది.

👉🏿తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు.

👉🏿ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. 

మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు. [

👉🏿తుంబురనాధామృతం అనేపదం అప్పుడప్పుడైనా మీరు వినే ఉంటారు. వీణానాధాన్నిఅమృతంలా అందిస్తే, ఆస్వాధించే వాళ్ళు’ తుంబురనాధం’గా అభినందిస్తారు. వీణానాధానికి తుంబురము పర్యాయపదమై పోయింది గదా, మరి అలాంటి తుంబురుని గురించి తెలుసుకుందామా?!

👉🏿తుంబురుడు గంధర్వ వంశమున పుట్టినవాడు. కుబేరుని కొలువులో నెలవున్నవాడు. అయితే రంబయందు ఉన్న వలపు చేత ఏ కొలువున ఉన్నాడో- ఆరాజు కుబేరుణ్నే కొలవడం మరిచిపోయాడు. తన వీణా నాధాన్ని అందివ్వలేకపోయాడు. అప్పుడు విషయాన్ని గ్రహించిన కుబేరుడు ‘రాక్షసుడివై పుట్టు’ అని తుంబురుడిని శపించాడు.

తుంబురుడు రాక్షసునిగా విరాధునికి పుట్టాడు. తుంబురుని వీణపేరు  చెపుతారు.

ఈ కథంతా రామాయణంలో వుంది. అయితే హర విలాసములో తుంబురుని కథ మరో విధంగా వుంది. 

👉🏿ఆ కథలో –తుంబురుడు సతీసమేతంగా ఈశ్వరుణ్ని సేవించడానికి బయల్దేరి వెళతాడు. దారి మధ్యలో దూర్వాస మహాముని లేడి పిల్లలకు ఆహారాన్ని పెడుతూవుంటాడు. తుంబురుడు ముని చేసే పోషణానికి ఆశ్చర్య పోయి చూస్తాడు. ఆ సంతోష సమయంలో ఆనందం పట్టలేక తుంబురుడు చిటిక వేస్తాడు. ఆ చప్పుడికి లేడిపిల్లలు బెదిరిపోయాయట. ఆకలితో పారిపోయిన లేడి పిల్లలను చూసి, అందుకు కారణమయిన తుంబురునితో ‘నువ్వు గంధర్వుడనని గర్వంతోవున్నావు, కనుక అది తీరేలా నువ్వు మనుష్య జన్మ నెత్తుదువు గాక!’ అని శపిస్తాడు. దుర్వాస మహామునికి కోపం ఎక్కువ కదా మరి.

ఈ శాప ఫలితంగానే తుంబురుడు చిరుతొండడుగా వైశ్యకుటుంబాన కాంచీనగరంలో పుట్టాడట.

 తుంబురుని శాప వృత్తాంతం ఎలా వున్నా- ఆయన మీటే వీణామృతము పురాణ కాలమునుండి ఈ కాలానికీ నిలచిపోయింది!

👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩