Posts

Showing posts from September, 2021

🚩 ద్రౌపది ప్రచేకిత !

Image
🌺🌺 . ♦ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట? . ♦సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవంజరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. ♦నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. . ♦ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా?  అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ?అనిపిస్తుంది.  ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! ♦సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడె

🚩తుంబురుడు! 🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻

Image
♦తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు. 👉🏿పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. 👉🏿 వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు కళావతి అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది. 👉🏿తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు. 👉🏿ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.  మధు మా

🚩🚩తెనాలి రామకృష్ణుడి పద్యాలు! -

Image
 🚩🚩తెనాలి రామకృష్ణుడి పద్యాలు! - ప్రెగడరాజు నరస కవితో వాదన సందర్భంలో- - ♦తృవ్వట బాబా తల పై బువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట చూడగ హుళులు క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !! - ♦ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్ మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !! ♦తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్ పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !! (".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం) - భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ) ♦చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !! - (అల్లసాని పెద్దన కవిని "అమవస" అనే మాట వాడినందుకు వెటకరిస్తూ) ♦ఎమి తిని సెపితివి కపితము బెమ పడి వెరి పుచ్చ కాయ మరి తిని సెపితో ఉమెతక్కయ తిని సెపితో అమవస నిసి యన్న మాట నలసని పెదనా !! - (రాయల వారిన

-“ఆకాశంలో ఆశల హరివిల్లు” ! (.#సిరివెన్నెల సీతారామశాస్త్రి) -

Image
  ♦“మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది?” అని అడుగుతుంటారు చాలామంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేను  నేను.రాసిన ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి, ఈ పాట పురిట్లోనే సంధికొట్టి చస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి పారెయ్యాలి అని ఎవరూ అనుకోరు. ♦ఆ పాట వీధినపడ్డ తర్వాత తెలుస్తుంది దాని బతుకేవిటో!  కవి రాతతో పాటూ పాటకి దాని సొంత తలరాత కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళింతర్వాత పాట “హిట్”, “ఫట్” అవడాన్ని బట్టి దాని మీద ఇష్టం ఏర్పరుచుకోవడం జరగదు. ఇష్టపడకుండా ఎలా రాయడం? - ♦కానీ ఇప్పటికీ ఎక్కువమంది నన్ను “సిరివెన్నెల” పాటల్లోనే గుర్తించడానికి ఇష్టపడతారు. “అంత గొప్ప పాటలు మళ్ళీ మీరు రాయలేరు!” అని అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మాత్రం నేను “హర్ట్” అవుతాను. ఎందుకంటే సిరివెన్నెల పాటలంత ప్రజాదరణ మిగతా పాటలకి రాలేదేమో గానీ సిట్యుయేషన్ దృష్ట్యా, అంతకన్నా గొప్పపాటలు చాలానే రాశాను. ♦“మీరు రాసిన పాటల్లో మీకు ఎదురైన అత్యంత క్లిష్టమైన పాట  ఒకటి చెప్పండి!” అని అడిగితే

🚩🚩 అయ్యకోనేరు ఇంకేం మాట్లాడుతుంది?

Image
? .♦ఓసారి ఇంటికి వెళ్ళొస్తె బావుడ్ను" అంటూ గడిచిన  నలభై సంవత్సరాలలో వందసార్లు అనుకుని ఉంటాను.  అలా అనుకుంటునే నలభై సంవత్సరాల కాలం గడిచిపోయింది.  ఇంటికి వెళ్ళడం అంటే, ఇన్నాళ్ళు నేను ఇంటిపట్టు ఉండక, దేశం మీద తిరుగుతున్నానని కాదు. దానికో చరిత్ర ఉంది. నా చదువు అవగానే బొంబయిలో ఉద్యోగం వచ్చింది. అక్కడో రెండు సంవత్సరాలు పని చేసిన తర్వాత అక్కడ్నుంచే ఎకాఎకీ అమెరికా వెళ్లిపోయాను. .♦"ఒరే చిన్నా. మనకి బాగా తెలసినవాళ్ళ అమ్మాయే.  హైదరాబాదులో మీ పెద్దన్న రత్నం వాళ్ళింటి పక్కనే ఉంటారుట.  అమ్మాయి తండ్రీ, అన్నయ్యా వాళ్ల ఆఫీసులోనే పనిచేస్తారుట.  మంచివాళ్లట. అమ్మాయి బాగానే చదువుకుందిట. ఇంగ్లీసు ఇంచక్కా మాట్లాడుతుందిట. రేపొద్దున్న నీకు అక్కడేం ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగో ఓ ఫోటో కూడా పంపుతున్నాను. అసలు నువ్వు ఆ దేశం వెళ్ళేలోపుగానే మూడుముళ్ళు వెయించెద్దామనుకున్నాం. నువ్వు పడనివ్వలేదు." అంటూ మా అమ్మ నేను అమెరికా వెళ్లిన కొత్తలో నాకో ఉత్తరం రాసింది.  అమ్మ ఉద్దేశం ఏమిటో నాకర్ధమయింది. ఫోటోలో అమ్మాయి బానేఉంది. సరే! అసలు అప్పడే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం అలోచించెలోగా మరో ఉత్తరం వచ్చింది. .♦"వచ

🚩 హనుమంతుడి పరిపూర్ణ సంగీతం.🌹

Image
  . (తుంబురుడు. ఎవడురా..అంటే ఈ రోజు పిడుగులు బూరా ఉదేవాడు అనుకుంటారు.😅) 👏👏👏👏👏👏 ♦దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు.  ♦తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది.  ♦నారదుడి వీణ మహతి.  ♦ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో,  వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం  చేసేవారు.  ♦తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం  పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా  మొదలయ్యాయి. ♦ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో  తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు.  ♦నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం  తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు.  ♦నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం  చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు. ‘ ♦గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు.  ♦‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు  సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ  తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసాన

🌹కిన్నెరసాని కథ 🌹

Image
🚩#తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’. ♦ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది. ♦ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది. ♦వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు #తెలం గాణ ప్రాంతంలోని ‘గుండాల’ అడవుల్లో ‘వుర్కోడు’ దాని జన్మస్థలం. అడవులు గుట్టలు గుండా ప్రవహిస్తూ పాల్వంచ సమీపంలోని ‘యానంబయలు’ గ్రామం వద్ద ఒక గుట్టను పెనవేసుకున్నట్టు ప్రవహిస్తుంది. అక్కడే 1966లో జలాశ యం నిర్మించారు. అక్కడి అడవితల్లి ప్రకృతి సోయగాలు కిన్నెరసాని సొగసులు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం వెరసి పర్యాటకులకు కన్నుల పండుగే!! ♦జలాశయం దాటిన కిన్నెరసాని ప్రవాహం రాతి తోగుల గుండా ఇసుకతెప్పలు మీదుగా సాగి భద్రాచలం సమీపం లోని భూర్గంపాడు వద్ద గోదావరి ఒడి చేరుతుంది. ♦ఇక విశ్వనాథవారి ఊహాకావ్యంలో కిన్నెరసాని ఒక తెలుగింటి కో

🚩తిట్ల భూతం! (చందమామ కథ .)

Image
🔻 ♦పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు.  అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నువ్వుదేన్ని సాధించగోరి, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో, . . కధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్ప సాగాడు: ♦వీరమ్మ పరమగయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతిమూర్తి వీరయ్యకిచ్చి పెళ్ళిచేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచానపడివుంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారూ, మనశ్శాంతి లేక మామగారూ ఎంతోకాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ, భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకూ, కూతురూ పుట్టారు. వీరమ్మ వాళ్ళనూ సాధిస్తూండేది. కూతురు పెద్దదై పెళ్ళి చేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. ♦భీముడు, వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడిలా వుంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా ఒంటబట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు, తల

🌹అమర గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి 🌹

Image
🤲 ♦ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం- సుబ్బలక్ష్మి పాడుతుంటే -స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు -భావించేవారు.  🤲🤲 ♦నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర,  నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. ♦కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. ♦గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు.  ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షి

🌹💥 మన సత్యనారాయణపురం . 💥🌹

Image
 🌹💥 మన సత్యనారాయణపురం . 💥🌹 ♦*మా బెజవాడలో ఆ పేటలో ఉండాలనే కోరిక,చిన్నతంలో మెండుగా ఉండేది నాకు....అక్కడి స్థానికుల్ని చూస్తే రవంత అసూయ కూడా కలిగేది.ఏదో ఒక పని కల్పించుకొని,కాసేపు ఆ పేటలో తిరిగి,తృప్తి పడేవాణ్ణి. ♦అలాగని,అక్కడేమీ ఆకాశ హర్మ్యాలుండేవి కావు.. నక్షత్రాల హోటళ్లసలే కనపడేవి కావు...విశాలమైన రోడ్లు మనకు ఆహ్వానం పలుకుతాయా అంటే అదీ లేదు. ఇంతకీ అక్కడ నాకు నచ్చిన అంశాలేమిటో తెలుసా!... ♦#నిత్యం,కళకళలాడుతూ తిరిగే మధ్యతరగతి మనుష్యులు..ఏరోజు సరుకులు ఆరోజు కొనుక్కుని,సంతోషంగా,తృప్తిగా జీవనం సాగించే సగటు జీవులు.. ♦#అడుగడుగునా దర్శనమిచ్చే గుళ్లు,ఆ గోపురాలపై,లౌడ్ స్పీకర్లలో ప్రాతఃకాలంలో వినిపించే భక్తి గీతాలు...ఇళ్లముందు అరుగులపై కూర్చొనిముచ్చట్లు చెప్పుకొనే ముత్తయిదువులు...వారి నుదుట రూపాయికాసంత కుంకుమ బొట్లు...ముచ్చటైన ముక్కుపుడకలు...గుబాళించేమల్లెల ఘుమఘుమలు.. ♦ఇంటి తరహా భోజన,ఫలహారాలు వండి వడ్డించే బ్రాహ్మణ హోటళ్లు..అప్పడాలపిండి ముద్దలు,ఊరగాయ పచ్చళ్లు,వేడివేడి మిరపకాయ బజ్జీలు,పెసర పుణుగులు,మద్రాసు తరహానఖార్సయిన ఫిల్టర్ కాఫీ బడ్డీలూ....ఒకటేమిటి? అన్నీ అక్కడ నోరూరిస్తూ పలుకరిస్తాయి. ♦#శివ

🚩🚩- అమ్మాయికి ...విశ్రాంతి..🚩🚩

Image
  ..................... 'అమ్మా నాకు విశ్రాంతి కావాలి'స్కూలు కాలేజీల చదువులతో అలసిన కూతురు తల్లితో చెప్పింది. 'మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తరువాత విశ్రాంతేకదా బాగచదువు' కూతురు లేచి చదవటం మోదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలి పోయింది. 'అమ్మా కొంచెం టయమివమ్మా విశ్రాంతి తీసుకుంటాను' ఆఫీసునుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. 'ముందు పెండ్లి చేసుకుని సెటిల్ అవ్వు తరువాత విశ్రాంతే' 'ఇప్పుడే ఏం అవసరమమ్మ. రెండు మూడేళ్ళుకాని...... 'సరియైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా. ఆ తర్వాత విశ్రాంతియేగా. ' కూతురు పెండ్లికి సిధ్ధమయింది.విశ్రాంతి మటేలేదు పెండ్లి అయింది. ఇద్దరు పిల్లల తల్లీ అయింది విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలి పోయింది. 'నీవు అమ్మవు.... .. పిల్లలను జాగ్రత్తగ పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏవిధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకోన్ని సంవత్సరాలే. ఓపికపట్టు. అంతే. పిల్లలు పెద్దవాళ్ళయితే నీకు విశ్రాంతేకదా..... ' ఇద్దరు పిల్లలకోసమై ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచిపోయ

❤️🚩రాగలహరి: కల్యాణి! 🚩❤️

Image
  ❤️🚩రాగలహరి: కల్యాణి! 🚩❤️ (రాగలహరి: కల్యాణిరచన: విష్ణుభొట్ల లక్ష్మన్న.) (చిత్రం -శ్రీ వడ్డాది పాపయ్య .) _ #కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం కల్యాణి.  ♦#కల్యాణి రాగం శుభప్రదమైనది. కల్యాణ ప్రదమైనది. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడినా, పాడినవారికి, విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాగం ఆధారంగా జనించిన జన్యరాగాలు అనేకం ఉన్నాయి. హమీర్‌కల్యాణి, బేహాగ్‌, అమృతవర్షిణి, హంసనాదం మొదలైనవి ముఖ్యమైనవి. కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన రాగాలైన కల్యాణి, తోడి, శంకరాభరణం, భైరవి, కాంభోజి రాగాల్లో కనీసం ఒక్క రాగమైనా లేకుండా ఒక చిన్న కచేరీ కూడా ఉండదు. అలాంటి ఈ ఐదు రాగాల్లో కూడా ముఖ్యమైన రాగం కల్యాణి. ♦కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు 1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు) 2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌) ♦3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి) 4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి) 5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం) 6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని) 7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం) ♦8. చల్లని వెన్నెలలో… (సంతానం) 9. మనసులోని కోర

🔴 చందన చర్చిత నీల కళేబర! !🚩 (చిత్రకారుడు శ్రీ బాపు..)

Image
 🔴 చందన చర్చిత నీల కళేబర!  !🚩 (చిత్రకారుడు శ్రీ బాపు..) 💥💥 ♦చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 1 💥💥 విలాసిని=ఓ శృంగార భావాలుకల రాధా!; చందన =శ్రీ గంధం; చర్చిత=పూసిన ;నీల=నల్లనైన ;కళేబర=శరీరంలో ;పీత=పచ్చనైన ;వసన=వస్త్రము కలిగినవాడు;వనమాలీ=వనమాల కలిగినవాడు ;కేళి =ఆటలచేత ;చలత్=కదలుచున్న ;మణికుండల =రత్న కుండలములచేత ;మండిత=అలంకరించిన ;గండ యుగ =రెండు చెక్కిళ్ళ మీద ;స్మిత శాలీ=చిరునవ్వు చేత ఒప్పుచున్నవాడు ;హరిః= శ్రీ కృష్ణుడు ;ఇహ=ఈ వసంత ఋతువులో ; కేళి పరే=ఆటలలో గొప్పతనము కలిగిన ;ముగ్ధవధూనికరే= అందమైన స్త్రీల సమూహములో ; విలసతి =విహరిస్తున్నాడు ; ఓ శృంగార భావాలుకల రాధా! గంధం పూసిన నల్లనైన శరీరం మీద పచ్చని వస్త్రం ధరించినవాడు , పాదాలవరకు వేలాడే వనమాల ధరించినవాడు అయిన శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు. ఆయనగారు ఆటలు ఆడటం వల్ల చెవులకు పెట్టుకొన్న రత్న కుండలాలు కదులుతున్నాయి . చెక్కిళ్ళమీద ఇంకా ఏమీ ఆభరణాలు అక్కర్లేదు. ఆయన చిరునవ్వులే ఆభరణాలు . 💥