❤ పండువెన్నెల ‘చంద్ర’ కళ.. నెరవేరిన ‘రంగుల’ కల!❤

❤ పండువెన్నెల ‘చంద్ర’ కళ.. నెరవేరిన ‘రంగుల’ కల!❤
‘♦అమ్మ’ ఓ కమ్మని మాట.. మరి బొమ్మ.. కల(ళ)ల బాట.
బొమ్మ అనగానే బాపు గుర్తొస్తారు..
ఆ తర్వాత ఇంకెవరు అంటే చంద్ర తప్ప మరో మాట వినపడదు.
చిత్ర కళా ప్రపంచానికి బాపు సూర్యుడైతే #చంద్ర ఓ పున్నమి చంద్రుడు. పున్నమి రోజున పుట్టడం వల్లనేమో ఆయన పున్నమి చంద్రుడిలా ‘వెలిగి’పోయారు.
♦#చంద్ర అసలు పేరు మైదం చంద్రశేఖర్. సొంతూరు వరంగల్ జిల్లా ధన్నాసరి. ఆయనలో అనేక కళలున్నాయి. చిత్రకారుడు, రచయిత, కళాదర్శకుడు, కార్టూనిస్ట్, కథకుడు, నటుడు.. మంచి మనీషి.
ఈయన కళ నచ్చి బి. నరసింగరావు తన ‘రంగుల కల’లో ఆర్టిస్టు పాత్రనే ఇచ్చారు. చంద్ర కాన్వాసు మీద వెలిగిపోయిన బొమ్మలు ఒకటా రెండా వేలకు వేలు. ఎవరైనా కథ రాస్తే చంద్ర బొమ్మ ఉండాల్సిందే. అ
ప్పట్లో అనేక పత్రికలకు ఆయనే ఆస్థాన చిత్రకారుడు.. ఆ స్థానం భర్తీ చేయలేని కలం వీరుడాయన. ‘చూపుల ద్వారా స్వాహా చేసి దృశ్యాలను వేళ్ళ చివర్ల కుంచెల ద్వారా ప్రపంచాల అంచుల వరకూ విసిరేసిన ప్రముఖుల్లో ఒకరని ఆయన గురించి ఎవరైనా చెబుతారు.
♦ఫైనార్ట్స్ కాలేజీలో చేరి చదువుకుంటూనే ఇంకో పక్క పత్రికలకు బొమ్మలు వేసేవారు. అలా రెగ్యులర్ గా ‘యువ’ పత్రికకు బొమ్మలు వేసేవారు. అప్పట్లో వ
చ్చే ప్రతి పత్రిక నుంచి కూడా బొమ్మల కోసం చంద్రనే అడిగేవారు. రంగనాయకమ్మ, తురగా కృష్ణమోహన్, నెల్లూరు కేశవరావులాంటి రచయితలు కథలు రాస్తే బొమ్మలు చంద్రతోనే వేయించుకునేవారు. అలా ఆయా కథలతో పాటు చంద్ర పేరు కూడా జనంలోకి వెళ్లిపోయింది.
చ్చే ప్రతి పత్రిక నుంచి కూడా బొమ్మల కోసం చంద్రనే అడిగేవారు. రంగనాయకమ్మ, తురగా కృష్ణమోహన్, నెల్లూరు కేశవరావులాంటి రచయితలు కథలు రాస్తే బొమ్మలు చంద్రతోనే వేయించుకునేవారు. అలా ఆయా కథలతో పాటు చంద్ర పేరు కూడా జనంలోకి వెళ్లిపోయింది.
♦బాపు తర్వాత ఎవరంటే చంద్ర అనే అనేవారు ఎవరైనా. న్యూవేవ్ రైటర్స్ లో చంద్ర కూడా ఒకరు. 150కు పైగా కథలు రాశారు. యర్రంశెట్టి శాయి, పమ్మి వీరభద్రరావుతో కలిసి గొలుసు నవల కూడా రాశారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు, మంచుపల్లకీ, తరంమారింది, ఓ అమ్మకథ, డిటెక్టివ్ నారద లాంటి దాదాపు పాతిక చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గానూ పనిచేశారు. 40 ఏళ్ల వయసులో అంబేద్కర్ యూనివర్శిటీలో ఆర్టిస్ట్ గా చేరారు. బాపు లాగా సినిమాలకు దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉన్నా అది మాత్రం నెరవేరలేదు. రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Comments
Post a Comment