🔥 -సైరంద్రి - 🔥


🔥 -సైరంద్రి -  🔥

🚩🚩

#విరాటపర్వంలో కీచకవధ, దక్షిణగోగ్రహణం  ,

ఇందులో నాయకుడు బీముడు, నాయిక ద్రౌపది, 

ప్రతినాయకుడు కీచకుడు. 

ఇందు ద్రౌపది నిర్వహించిన పాత్ర సైరంద్రీ జాతి స్త్రీ – పేరు మాలిని.

#సైరంద్రి వృత్తి కేవలము పరిచారిక కాదు. 

మాహారాణిని రకరకములుగా ఆలంకరింపజేసి, వివిధ లలితకళల ప్రావీణ్యంలో ఆయా వేళలలో, ఆరాణి కపూర్వోల్లాసం కలగించడం. తనకనువుగా నుండు ఆ వృత్తి నెంచుకొనుట ద్రౌపది బుద్ధి కుశలతకు, ఆభిజాత్యానికి మొదటిమెట్టు.తక్కిన పర్వాలన్నింటిలో కలిసి ద్రౌపది 

ఒక ఎత్తైతే ఈ పర్వంలో సైరంద్రి పాత్ర పోషించిన ద్రౌపది ఒక ఎత్తు. 

నవరస నాయికగా ఆమె ఇందు దృగ్గోచరమౌతుంది. 

అసమాన సౌందర్యరాశిగా, ధీరగా, సరసవచోనిపుణగా,

 చతురగా, అభిజాత్యమే ఆభరణమైన అతివగా, మానవతిగా, కరణేషుమంత్రిగా, సంయమనశీలిగా, సహనికి ప్రతిరూపంగా, వివేకిగా, ఉచితానుచితముల నెరింగిన ఊవిదగా, అన్నింటినీ మించి అభినయకౌశలము గల్గిన అతివగా, పరమభక్తురాలిగా, పతివ్రతగా, 

తన భర్తల శౌర్య పరాక్రమాల పట్ల అమితమైన విశ్వాసంగల ధర్యపత్నిగా, 

ఒక మహాశక్తిగా ఈ విరాట పర్వంలో ద్రౌపది ఆలరిస్తుంది. 

చలన చిత్రంలోని నాయికను చూచినంత స్పష్టంగా తిక్కనామాత్యుడు

 తన రచనా దర్శకత్వంలో పాంచాలిని సైరంధ్రిగా కనుల ముందు వర్తింపజేసాడు.

*కీచకవధ ఉపకీచకుల వధ జరిగి 

ఆవార్త దావానంలా చెలరేగింది.. ఊరిలోవారందరూ

 ఈవిషయం గురించే చర్చించుకుంటున్నారు.

గంధర్వులట. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఒక స్త్రీ (సైరంద్రి 

అనుకుంటారు అందరు. - ద్రౌపతి అని ఎవరికీ తెలియదు)

 కోసంఆమె భర్తలైన గంధర్వులు కీచకుడిని ముద్దలా చేసి వింతగా చంపారట! చేతులు, కాళ్ళు, తలా డొక్కలోకి చొప్పించి ఒక గుండ్రని అకారంలా మార్చారట! ఆహా ఆమె సౌందర్యం కోసం కీచకుడు ఆశించి ఇలా దిక్కుమాలిన ప్రేతంలా తయారయ్యాడు. పరస్త్రీ వ్యామోహం కూడదని వారించిన వినకుండా మృత్యువుని ఆహ్వానించాడు. పరస్త్రీ పొందు వలన లక్ష్మి పోతుంది, పరస్త్రీ పొందు ఆపేక్షిస్తే ధర్మం పోతుంది, 

శక్తి పోతుంది, అష్ట సిద్దులు నశిస్తాయి, సర్వ శక్తులు కరిగిపోతాయి. జీవితమే అంధకారం అవుతుంది. కుటుంబం విచ్చిన్నమౌతున్ది. శత్రువులు పెరుగుతారు. అని కొందరు.

అమ్మో సైరంద్రి రాక్షసి అని కొందరు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లడుతూ ఉన్నారు.

పంచ మహాపతివ్రతల్లో స్థానం సంపాదించుకున్న ద్రౌపది తక్కినవారికన్నా బిన్నమైన జీవితాన్ని గడిపి అద్వితీయమైన వనితగా వాసికెక్కినది. ఈమె వ్యక్తిత్వం నేటివారికి సైతము ఆదర్శమే. ప్రతి మహిళ సమస్యలను సమయస్పూరితో సమయానుకూలంగా సరియైనరీతిలో సమన్వయించుకుని, అవసరమైనచో ధైర్యంగా ఎదిరించి పోరాడే మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని సైరంధ్రిగా ద్రౌపది హెచ్చరిక. ఒక మాహామహిమాన్వితమైన మహిళను ఇన్ని సుగుణాల సమాహారంగా మన కనుల ముంది నిలిపి మనస్సును, బుద్ధిని పరమళింపజేసిన ఉభయ కవిమిత్రుని ఋణం తెలుగుజాతి తీర్చుకోలేనిది.

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩