🍂☘-శర్మ కాలక్షేపం కబుర్లు-☘🍂 ♥మన కన్నా ...అదృష్ట వంతులు ఎవరూ ??


🍂☘-శర్మ కాలక్షేపం కబుర్లు-☘🍂

♥మన కన్నా ...అదృష్ట  వంతులు  ఎవరూ ??

1940 – 1960 మధ్యలో

మీరు పుట్టినవారే అయితే

ఇదిమనకోసం..

వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది

మనదే చివరి తరం.పోలీస్ వాళ్ళని

నిక్కర్లలో చూసిన

తరమూ మనదే.స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని

కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమేచాలా దూరం అయితే

సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళుస్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.

మనమే మొదటగా వీడియో గేములు ఆడటం.

కార్టూన్స్ ని రంగులలో చూడటం.

అమ్యూజ్ మెంట్ పార్కులకి

వెళ్లటం.

రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్

చేసినవాళ్ళం.

అలాగే

వాక్ మ్యాన్ తగిలించుకొని

పాటలు వినేవాళ్ళం.

VCR ని ఎలా వాడాలో తెలుసుకొని

వాడిన తరం మనదే..

అలాగే

కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన

తరం కూడా మనదే.

అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.

సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..

సైకిల్లకి బ్రేకులు లేకుండా

రోడ్డు మీద ప్రయాణించిన

ఆ రోజులు మనవే.

మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.

స్కూల్ కి

కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా,

జుట్టు కూడా దువ్వుకోకుండా

మామూలు బట్టలతో వెళ్ళాం

ఇప్పటి తరం

అలా ఎన్నడూ వెళ్ళలేదు

స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.

స్నేహితుల మధ్య

” కాకి ఎంగిలి ” చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.

ఎవరూ

ఆస్తులు, అంతస్థులు చూడకుండా

స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,

చెరువు గట్ల వెంట,

కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.

జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.

సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల

కుప్పలు ఆడిన తరము మనదే.

శుక్రవారం సాయంత్రం

” చిత్రల హరి” కోసం

ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే

ఆదివారం ఉదయం

9 కి పనులు

తప్పించుకుని

“మహాభారతము”

” రామాయణం”

” శ్రీకృష్ణ” చూసిన

తరమూ మనదే…

ఉషశ్రీ గారి

భారత రామాయణ ఇతిహాసాలు

రేడియోలో విన్నది మనమే,

అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా

చూసుకున్న ఘనతా మనదే ..

ఆదివారం ఒక గంట

అద్దె సైకిల్ కోసం

రెండు గంటలు వేచి ఉన్నది మనమే…

పలకలని వాడిన

ఆఖరు తరం కూడా మనదే.

రుపయికు

థియేటర్ లో సినిమా చూడడానికి

రెండు కిలోమీటర్ లు

నడిచిన కాలం..

గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన

కాలం..

మనమే.. మనమే

అమ్మ 5 పైసలు ఇస్తే

బఠానీలు తిన్నదీ మనమే..

గోర్లపైన కొంగ గోరు గుర్తులు

చువ్వాట..

సిర్రగోనే ఆట..

కోతి కొమ్మ…

అష్ట చెమ్మ…

ఆడిన

తరము మనదే.

క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,

కనీసం 20 ఫోన్

నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.

ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..

మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ,

ఫ్లాట్ స్క్రీన్స్,

సరౌండ్ సౌండ్స్,

MP3, ఐ ప్యాడ్స్,

కంప్యూటర్స్,

బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్…

లేకున్నా

అంతులేని ఆనందాన్ని పొందాం.

మన పిల్లలకు అవి తెలియదు

మన పెద్దలకు ఇవి తెలియదు

కానీ

మనం అవి ఇవి చూశాం

ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు కదూ..♥

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

  1. ఒక్క సారిగా నా చిన్ననాటి రోజులన్నీ నాముందుకొచ్చి కనబడ్డాయి. ఇవన్నీ నాకు కడప జిల్లా ప్రొద్దుటూరు మునిసిపల్ హై స్కూల్లో చదువుకున్న ప్పటి తీపి గుర్తులు. థాంక్స్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)