❤️🔻🙏🏿విష్ణు సహస్రనామం -సూత స్పటికం !🙏🏿🔻❤️
❤️🔻🙏🏿విష్ణు సహస్రనామం -సూత స్పటికం !🙏🏿🔻❤️
......................(టేప్ రికార్డర్ )................................
విష్ణు సహస్రనామం మనకు ఎలా వచ్చింది.??
.✍🏿భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు,
కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితోసహా అందరూ
అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు.
ఎవరూ వ్రాసుకోలేదు.
అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా
విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.
"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి"
అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.
*శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే
అవుతుంది" అని చెప్పాడు.
"అదెలా" అని అందరూ అడిగారు.
*శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం
వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీనిప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి
తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే
ఈస్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే)
వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.
*శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట
అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి
కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస
మహర్షి వ్రాసిపెట్టాడు.
*ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికంద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని ,
1940వసంవత్సరం లో శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారుసెలవిచ్చారు.
❤️🙏🏿అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।❤️🙏🏿
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments
Post a Comment