🔻కలవారి కోడలు!🔻

 



                                  🔻కలవారి కోడలు!🔻




(అవిభక్త కుటుంబము నందలి సౌందర్యమును


వ్యక్తము చేస్తుంది ఈ పాట. )


.


✍🏿కలవారి కోడలు కలికి కామాక్షి


కడుగుచున్నది పప్పు కడవలో పోసి


.


అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న


కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె


.


ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టమ్ము


తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు


.


ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము


మీ అత్తమామలకు చెప్పిరావమ్మ


.


కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా


మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


.


నేనెరుగ నేనెరుగ మీ మామ నడుగు


.


పట్టెమంచము మీద పడుకున్న మామ


మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


.


నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు


.


భారతము చదివేటి బావ పెదబావ


మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


.


నేనెరుగ నేనెరుగ నీ అక్క నడుగు


.


వంట చేసే తల్లి ఓ అక్కగారు


మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


.


నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు


.


రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగీ


మా అన్నలొచ్చారు మమ్మంపుతార?


.


పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర


పోయిరా సుఖముగా పుట్టినింటికిని




ఎంత సుఖమైన హుకుము!🙂




8888888888888888888888888888

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)