❤️🔻🙏🏿-సమస్యాపూరణం-🙏🏿🔻❤️
🚩
*సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
అవధానికి పృచ్ఛకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తాడు. అవధాని ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవలసి ఉంటుంది.
*ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధానాన్ని అవధాని ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
సమస్యా పూరణం ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోనికి వచ్చినది. కవి, పండితుల సామర్థ్యాన్ని పరీక్షించడం లో సమస్యాపూరణాన్ని కూడా ఒక భాగంగా వాడుతారు.
*ఉదాహరణ
సమస్య:“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్”
*పూరణ:
ఉండ్రాని యడవి లోపల
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
*భావం:
ఉండరాని అడవిలో గుండ్రాయి గా పడి ఉన్న ముని (గౌతముడు) పత్ని (అహల్య) పై కోదండరాముని పాదము తగిలి ఆగుండ్రాయి తిరిగి అహల్య గా మారి నడుచుకుంటూ వెళ్లి పోయింది అని అవధాని గారు సమస్య పాదాన్ని రామాయణం లో అహల్యా వృత్తాంతానికి జోడించి చెప్పారు.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments
Post a Comment