❤️ కవి చౌడప్ప❤️

 

❤️ కవి చౌడప్ప❤️

(🚩విషయ లాలసతలో పడిపోయి సర్వం కోల్పొయిన సెలబ్రటీలు మహానటి సావిత్రి, రాజబాబు జీవితాలకు.. అదే స్థాయిలో బ్రతికి అన్నీపోగొట్టుకున్నా; కోవెల మెట్లు కడుగుతూ పారమార్ధ చింతనతో జీవితం గడుపుతున్న కాంచన జీవితానికీ ఎంత తేడా!!.

.. సరిగ్గా ఇదే విషయం కవిచౌడప్ప శతకం చదివిన ఏ పాఠకుడికైనా ఈ 4పద్యాల ద్వారా స్ఫురించి తీరుతుంది..



🚩కవి చౌడప్పగా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప 16వ శతాబ్దపు తెలుగు కవి. నియోగి బ్రాహ్మణుడు. మట్లి అనంత భూపాలుని చేతనూ, తంజావూరు రఘునాధ రాయల చేత సన్మానించబడటం చేత ఈతను బహుశా 1580-1640 మధ్య కాలం వాడై ఉండవచ్చునని అంచనా. 
తెలుగులో తొలి బూతు కవిగా పేరుతెచ్చుకున్న చౌడప్ప, ఎండలో ఎండనివాడు, వానలో తడవనివాడు లేనట్టే తన నీతి విననివాడు కూడా లోకంలో లేడని సగర్వంగా చెప్పుకున్నాడు. .

కుందవరపు చౌడప్ప, కడప జిల్లా, ఖాజీపేట మండలంలోని పుల్లూరు ( ప్రస్తుత ఆంజనేయకొట్టాలు ) గ్రామానికి చెందినవాడని చెప్పటానికి ఆధారాలు దొరికాయి.

చౌడప్ప తన పద్యాలలో వేణుగోపాలస్వామి భక్తుడినని చెప్పుకున్నాడు.

మానవ జీవితములో బూతు సహజమని చౌడప్ప ఉద్దేశము. అయినా బూతు కోసము ఈయన బూతు చెప్పలేదు. కుందవరపు కవిచౌడప్పా! అన్న మకుటముతో ఈయన రాసిన కంద పద్యాలు కవి చౌడప్ప శతకముగా ప్రసిద్ధి చెందినవి. ఈ పద్యాలలో భాష కొంత మితిమీరినా భావములో మాత్రము సూటిగా నిజాన్నే ఎండగట్టాడు.


స్వయంగా బహుళ ప్రచారం పొందిన కవి చౌడప్ప శతకం వ్రాయడం వల్లనే కాక, వివిధ చాటుపద్యాల్లో సంకీర్తుడు.

🚩శృంగార పద్యాలు!


నీతులకేమి యొకించుక బూతాడక దొరకు నవ్వుపుట్టదు ధరలో నీతులు బూతులు లోక ఖ్యాతులురా కుందవరపుకవిచౌడప్పా.


భావం: ఎంత నీతి చెప్పినా అది దొరగారు (రాజు) మెచ్చుకొని కొంచం నవ్వుకోవాలంటే దానికి కాస్త బూతు జోడించక తప్పదు అంటాడు..


అంభో జాక్షులలోపల రంభయె కడునందగత్తె, రాగంబులలో గాంభీర్యము గల రాగము కాంభోజియె కుందవరపుకవిచౌడప్పా.


భావం: అందానికి ఊర్వశి, మేనక, తిలోత్తమల కంటే రంభనే ప్రామాణికంగా తీసుకోవాలంటాడు...


అందేమి కలదు క్రిందిది యెందుకు మగవాడి జూడనీయరు లంజల్ కుందనమీయక నూతన కందర్పా కుందవరపు కవిచౌడప్పా..


తొత్తు రతివేళ బుఱ్రని పిత్తిన కనుచెదిరి విటుండు బెదరక తొత్తా పిత్తితివా యని విడువక కత్తెము నిడు కుందవరపుకవిచౌడప్పా.


కుత్తుకచెడి దగ్గిన, మూతెత్తక చెడతుమ్మి నావలించిన నగరా; పిత్తుకు నగుదురదేమో .. గత్తున మరి కుందవరపుకవిచౌడప్పా.


భావం: దగ్గినా, తుమ్మినా, ఆవులించినా మనుషులు నవ్వరు .. అదేందో గానీ పిత్తితే నవ్వుతారు అని చిలిపిగా ప్రశ్నిస్తున్నాడు...


బండగులాములు యాచక తండంబుల కియ్యలేరు తము దండించే ముండల కిత్తురు *ధగిడీ గండలు మరి కుందవరపుకవిచౌడప్పా


భావం: అదుక్కునేవాకి పట్టెడి అన్నం పేట్టటానికి మనసు రాని ఱానికి మొగుళ్ళు కూడా తమకు విలువ ఇవ్వకపోయినా లంజలకు ఇస్తారని సమాజ పోకడను నిందిస్తున్నాడు


ధగిడీ గండలు = ఱంకుమొగుళ్ళు

లంజయును బీరకాయయు ముంజయు బాల్యమున చాలమోహము గొలుపున్ రంజనచెడి ముదిరిన వెను కం జూడరు కుందవరపుకవిచౌడప్పా.


రూకల్ పాతికియ్యని పూకెత్తు గులాము నీతిపుంగవుడగునా ... కాకము కోకిల యగునా కాకోదర కుందవరపుకవిచౌడప్పా


భావం: చేసేది కరణం పని కనుక పని చేయించుకొని ఓ పాతిక రూకలు ఇవ్వటానికి ' యెత్తి చూపించే ' వాళ్ళు నీతి పుంగవులెట్లా అవుతారని ప్రశ్నిస్తున్నాడు..


🚩గంభీరమూర్తి చౌడప్ప!


ఇప్పటివరకూ మనం చదివిన పద్యాలలో చౌడప్పను ఓ శృంగార కవిగా మాత్రమే గుర్తిస్తాము..కానీ అతనిలో ఎంత గంభీరమూర్తి వున్నాడో.. ఎన్ని జన్మ సాఫల్యతా లక్షణాలున్నాయో.., ఆ మనిషిలోని మనసు ఏమిటో మీరే గమనించండి..


తనయునికిని, పరదేశికి, పెనిమిటికిని ఒక్కరీతి భోజనమిడు ఆ వనితను పుణ్యాంగనయని ఘనులనుదురు కుందవరపు క.చౌ.


భావం: తన కుమారునికైనా, భర్తకైనా పరాయి వాడికైనా ఆకలి గమనించి కడుపారా అన్నం పెట్ట గలిగిన వాళ్ళనే పుణ్యవతి అని జనులు మెచ్చుకుంటారట.. (అటువంటి స్త్రీని గౌరవించకుండా మరో దృష్ఠితో చూడటం పాపం ఆయనకు చేతకాలేదు..)


పరవిత్తము గోమాంసము పరసతి తన తల్లియనుచు భావించిన ఆ నరుండు నరుండా రెండవ కరివరదుండె కాకోదర కుందవరపుకవిచౌడప్పా..


కరి వరదుండు = గజేంద్రుని బ్రోచిన విష్ణుమూర్తి..

చిత్తము శ్రీహరిపై కిం చిత్తును నిలుపంగలేని చెడుగుల; మడియన్ మొత్తి యమభటులు ద్రోతురు కత్తులపై కుందవరపుకవిచౌడప్పా


తన మదిలోపల దశరధ తనయులలో పెద్దవాని దలచిన జన్మం బనయంబు పావనంబని.. ఘనులందురు కుందవరపుకవిచౌడప్పా.


భావం: మనసులో శ్రీరాముడిని తలచుకున్నప్పుడే జన్మ పావన మౌతుందట..


ఎప్పుడు పడిపోనున్నదో తెప్పున ఈ తనువుకీర్తి గురవెరుగడు దామొప్పె ధనగర్వ తిమిరము గప్పినచో కుందవరపుకవిచౌడప్పా.


భావం: ఈ జీవితం, ఈ శరీరానికి ఆపాదించుకున్న కీర్తి, ధనగర్వంతో ఏర్పరుచు కొంటున్న చీకటి పొరలు.. ఇవన్నీ బుద్బుదాలు.. పంపిన భగవంతునికి కూడా తెలియకుండా ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు..


మునుపటి సుకవుల నీతులు జననుతములు, కుందవరపు చౌడుని నీతుల్ వినవినఁదేట తెనుంగై కనబడుగద కుందవరపు కవి చౌడప్పా!


కందము నీవలెఁ జెప్పే యందము మఱిగాన మెవరియందును గవిసం క్రందన యసదృశ నూతన కందర్పా కుందవరపు కవి చౌడప్పా!

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!