🙏హరిహరులకు బేధములేదు 🙏
✍🏿తరణికంటి సుర్యలక్ష్మి.(మా అక్కగారు.)
💥సీ॥
హరియనిబిలచిన హరియించుపాపాలు
శివుడనిబిలచిన చింతలేదు
శంకరునిబిలువ సంకటాలుదొలగు
శ్రీపతిగొలువంగ సిరులుయిచ్చు
మాధవుడిచ్చును మనుగడమనకంత
చంద్రశేఖరుడిచ్చు చల్లదనము
నందివాహనుగొల్వ నరకముతొలగును
నారాయణునిగొల్వ నాకమొందు
ఆ॥
మల్లికార్జుగొలువ మలినాలుదొలగును
మురళినాధుడొసగు మంచిమనసు
హరిహరులిరువురికి అసలుబేధములేదు
హరిహరులనునిలుపు హృదయమందు॥💥
🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿

Comments
Post a Comment