🚩 "మను చరిత్ర" ❤️ (మను చరిత్ర...అల్లసాని పెద్దన్న గారు.)


                     🚩 "మను చరిత్ర" ❤️

               (మను చరిత్ర...అల్లసాని పెద్దన్న గారు.)


✍🏿ఇక పెద్దన గారి "మను చరిత్ర" ను గురించి కొన్ని విషయాలు చెపుతాను. మను చర్రిత్రకు పెద్దన గారు పెట్టిన పేరు స్వారోచిష మను సంభవము. అనగా స్వారోచిష మనువు యొక్క జన్మ వృత్తాంతం అని అర్ట్థము.

కాని ఇది మను చరిత్ర గా ప్రజల వాడుక వలన మారి పోయింది.


🚩

ప్రవరుడు పాదలేపనం పూసుకొని హిమాలయాలకు వెళ్తాడు. ఆచట అది కరిగి పోతుంది. ఇంతలో వరూధిని వస్తుంది. ఆమె అతనిని మోహిస్తుంది. అతడు తిరస్కరిస్తాడు. అగ్ని దేవున్ని ప్రార్థిస్తాడు. తిరిగి ఇంటికి వస్తాడు.

🚩

ఇంతటితో కథ అయిపోయింది. కాని పెద్దన ఇక వరూధిని కథ చెబుతాడు. ఒక గంధర్వుడు ప్రవరుని వేషంతో వరూధినిని మోసం చేసి ప్రేమ లోనికి దింపి, విడిచిపెట్టి వెళ్తాడు. వరూధిని గర్భవతి అవుతుంది. వారికి స్వరూచి పుడుతాడు.

🚩

మరొక్క గంధర్వుడు (ఇందీవరాక్షుడు) గురువు శాపంతో రాక్షసుడు అవుతాడు. కూతురుని (మనోరమ) మ్రింగ బోతాడు.

స్వరూచి వలన శాప విమోచనం చెంది తన కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమెకు ఇద్దరు చెలికత్తెలు (కళావతి, విభావసి). వారిని కూడ స్వరూచి వివాహ మాడతాడు.

🚩

ఈ ముగ్గురు భార్యలకు మువ్వురు కొడుకులు పుడుతారు.

వారికి స్వరూచి మూడు రాజ్యాలనిచ్చి వానిని ఏలుకోమంటాడు.

ఒక నాడు స్వరూచి వనవిహారం చేస్తూ ఉండగా, దేవతల ప్రేరేపణ వలన లేడి రూపంలో ఉన్న వనదేవతను ఆమె బతిమాలగా, కౌగలించు కుంటాడు.

🚩

వనదేవత నిజ స్వరూపము దాల్చగా, ఆమెను వివాహ మాడుతాడు.

విరక్తి జెంది మొదటి ముగ్గురు భార్యలను విడిచిపెట్టి వనదేవతతో కాపురం చేసి స్వారోచిషున్ని కంటాడు.

అతడే పదునాల్గు మనువులలో ఒకడు. అందుకే

ఇది స్వారోచిష మను సంభవం లేక మను చరిత్ర అయింది.


🚩🚩

వరూధిని ప్రవరున్ని జూచినపుడు చక్కని పద్యం పెద్దన చెపుతాడు.


💥💥


ఉ: చూచి ఝళంఝళత్కటక సూచిత వేగ పదార వింద యై


లేచి కుచమ్ములన్ దుఱుములేనడు మల్లల నాడనయ్యెడన్


బూచిన యొక్క పోక నునుబోదియ జేరి విలోకనప్రభా


వీచికలన్ దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్.

💥💥💥💥💥



ఈ పద్యంలో “తుఱుము” అనే పదం చాల గొప్పది.

తుఱుము అంటే మనం టెంకాయను తుఱుముతాము గదా

. అంటే ఆ కుచములు టెంకాయల వలె ఉంటాయట.

ఇక్కడ చక్కగా గుండ్రంగా అనే గాక, స్తన కాఠిన్యతను

కాళి దాసు లా చెప్పకయే చెపుతున్నాడు కవి.


💥💥

ఎక్కడి వాఁడొ ! యక్ష తనయేందు జయంత వసంత కంతులం

జక్కఁ దనంబునన్ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం

బెక్కడ? ఈ తనూవిభవమెక్కడ? ఏలని బంటుగా మరుం

డక్కఁ గొనంగ రాదె, యకటా ! నను వీఁడు పరిగ్రహించినన్


💥💥💥💥💥💥💥


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)