🚩🚩 #శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!! **శ్రీనాథుడు అంటేనే తెలుగు సాహిత్యంలో ఒక అధ్యాయం. ఆయన రచించిన శృంగార నైషధం అనే కావ్యం తెలుగు సాహిత్యానికి ఒక అపురమైన ఆభరణం. శ్రీహర్షుని సంస్కృత నైషధీయ చరిత్రను ఆధారంగా చేసుకుని శ్రీనాథుడు రచించిన ఈ కావ్యం, #నల_దమయంతిల ప్రేమ కథను అద్భుతంగా వర్ణించింది. **శృంగార నైషధం ఎందుకు ప్రత్యేకం? శృంగార రసానికి అద్దం: శృంగార నైషధం అనే పేరును బట్టి తెలుస్తుంది, ఈ కావ్యం ప్రధానంగా శృంగార రసాన్ని చిత్రిస్తుంది. నల-దమయంతిల మధ్య ప్రేమ, విరహం, మళ్ళీ కలయిక వంటి భావాలను కవి అద్భుతంగా వర్ణించాడు. **భాషా సౌందర్యం: శ్రీనాథుడు తెలుగు భాషకు చేసిన సేవ అంతా ఇందులో కనిపిస్తుంది. అతను తెలుగు భాషను ఎంత అందంగా, వైవిధ్యంగా వాడాడో ఈ కావ్యంలో చూడవచ్చు. వర్ణనల అద్భుతం: ప్రకృతి వర్ణనలు, నాయక-నాయికల అందాల వర్ణనలు, భావోద్వేగాల వర్ణనలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సంస్కృతం-తెలుగు సంయోగం: సంస్కృత పదాలను తెలుగులో అద్భుతంగా విలీనం చేసి ఒక అద్భుతమైన భాషా శైలిని సృష్టించాడు శ్రీనాథుడు. #కథాంశం *నల-దమయంతిల ప్రేమ కథ మనకు తెలిసినదే. శ్రీనాథుడు ఈ కథను తనదైన శైలిలో మరింత అందంగా వర్ణించ...
- #కోటబుల్_కోట్స్_మాయాబజారు !! * 'ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?', 'ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉందిగా', *'ఉద్దండపండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయా',* 'పెళ్లి పెద్దలంటూ శుద్ధమొద్దులు తయారయారు', *'ఉన్నమాటైనా సరే ప్రభువుల ఎదుట పరులను పొగడరాదు'* , +'చేతులు రాక కాదు - చేతకాక అని చెప్పు', ఇలాటి కోటబుల్ కోట్స్ మాయాబజారు నిండా ఎన్నో వినబడతాయి. ఇవన్నీ సామెతల స్థాయికి ఎదిగిపోయాయి. 'మాలో గోటు అంటే గొప్ప అని అర్థం పండితులు తమకైనా తెలియదుటండీ' అని చినమయ అనగానే వెంటనే ఈ పండితుడు 'ఆ పై మాట నేను చెబుతా, తీట అంటే గౌరవం అంతేగా!' అంటాడు. పండితులను ముఖస్తుతితో ఎలా బోల్తా కొట్టించాలో గొప్ప ఉదాహరణ. 'పెళ్లి సందడిగా జరిపిస్తాన'ని కృష్ణుడు వదినగారికి మాట ఇస్తాడు. ఎలా కావాలంటే అలా అన్వయించుకునే వీలుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ జనజీవితంలో భాగంగా అయిపోయాయి కూడా ! ఇదివరకు ఏదైనా గొప్పపని చేస్తే 'మెచ్చి మేకతోలు కప్పడం...
🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy) ♦️ ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు సమున్నత స్థానం ఉంది. కృతి కర్తగా #అల్లసాని వారికి అలాగే కృతి భర్తగా కృష్ణరాయలకు ఆ కావ్యం అజరామర కీర్తి ప్రతిష్ఠలను అందించింది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను వర్ణనా చాతుర్యంతో మహాప్రబంధంగా తీర్చి దిద్దిన మహాకవి అల్లసాని. అల్లసాని వారు తన గురువు శఠగోపయతి వద్ద "అజప" దీక్ష తీసుకున్నవాడు. ఇది ఎవరి కథ: ఈ ప్రభంధం స్వారోచిష మను సంభవాన్ని గూర్చి చెప్పబడింది. స్వారోచిషుడు రెండవ మనువు కాగామొత్తంగా 14 మంది మనువులు ఉన్నారు. కథగా చెప్పుకోవలసి వస్తే..... #ప్రవరుడు అందమైన యువకుడు. అతిథి సేవా తత్పరుడు. ఒకనాడు ఒక సిద్ధుడు ప్రవరుని ఇంటికి వస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన ప్రవరుడాతనిని తాను తిరిగిన ప్రదేశాలలలోని విశేషాలను చెప్పమని కోరడం, సిద్ధుడు చెప్పడం జరుగుతుంది. చిన్న వయసులో ఇన్ని ప్రదేశాలను చుట్టిరావడమెలాగా అనే ప్రశ్నను ప్రవరుడు వేయడం, దానికి సిద్ధుడు తన దగ్గర ఉండే పసరు మహిమను చెప్పడం జరుగుతుంది. ఆ పసరును అడిగి కాలికి పూయించుకున్న ప్రవరుడు హిమాలయాలను...
Comments
Post a Comment