❤️అల్లసాని పెద్దన -గండ పెండెరం -పద్యం .❤️


                   ❤️అల్లసాని పెద్దన -గండ పెండెరం -పద్యం .❤️

🚩అల్లసాని పెద్దనకృష్ణదేవరాయల ఆస్థానంలోని
అష్టదిగ్గజాలలో మొట్టమొదటి వాడు.
చొక్కయామాత్యుని పుత్రుడు. ఆంధ్రకవితాపితామహుడు.
ఒక రోజు కృష్ణ దేవరాయల వారు ఒక బంగరు పళ్ళెం తెచ్చి
దానిలో గండ పెండేరాన్ని ఉంచి ఆస్థాన కవులను జూచి
"మీలో ఎవరైనా సంస్కృతాంధ్ర భాషలలో సమానంగా కవిత్వం చెప్పిన యెడల వారికి ఈ గండ పెండేరం యిస్తాను" అని చెప్పారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు కృష్ణ దేవరాయల వారు
💥
ఉ: ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా

నొద్దిక నాకోసంగు మనియొక్కరు గోరగలేరు లేరొకో

అనే పద్యం ప్రారంభించారు. అల్లసాని వారు లేచి ఆ పద్యాన్ని

“పెద్దన బోలుపండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే

పెద్దన కీ దలంచినను పేర్మిని నాకిడు కృష్ణ రాణృపా”💥

అని పూరించారు. ఆ పైన ముప్పది పాదాల ఉత్పలమాలికను సగం పాదాలు అచ్చ తెన్గులో సగం సంస్కృతంలో ఆశువుగా చెప్పారు.

ఈ పద్యం చెప్పడానికి ఐదు నిముషాలు పడుతుంది.
💥
​ఉ: పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని

ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్

గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ

రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ

టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ

భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా

శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం

గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం

ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా

యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్💥
🚩
ఈ విధంగా పెద్దన గారు చెప్పిన మరు క్షణమే రాయల వారు ఆంధ్ర కవితా పితామహుడైన పెద్దన గారి వామ పాదానికి గండ పెండేరాన్ని తొడిగారు. ❤️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)