రుక్మిణీ కళ్యాణం.🚩 (పోతనామాత్యుడు.,,,,వాసుదేవాగమన నిర్ణయము.కొనసాగింపు ..5) 💥



రుక్మిణీ కళ్యాణం.🚩
(పోతనామాత్యుడు.,,,,వాసుదేవాగమన నిర్ణయము.కొనసాగింపు ..5)
💥
ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు
అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.
💥
"కన్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా
కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్.
👉👉
(“సచ్చీలుడా! రుక్మిణీకన్య మీద నాకు గాఢమైన మనసుంది.
రాత్రిళ్ళు నిద్రే రాదు. మా పెళ్ళికి ఇష్టపడక రుక్మి పెట్టే అడ్డంకులు
నాకు ముందే తెలుసు. కట్టెలను అగ్ని దహించినట్లు, శత్రువులను మర్ధించి కన్యను తీసుకొస్తాను.)
💥
"వచ్చెద విదర్భభూమికిఁ;
.
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
.
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
.
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్."
👉👉
(విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకొస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్దంచేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు.)
👉👉
ఇలా చెప్పి, రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసు కొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి యైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము" లనే గుర్రాలు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథ మెక్కేడు. ఒక్క రాత్రిలోనే నానర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు.
👉👉
ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశవర్తుడు అయిన భీష్మకుడు కూతుర్ని చైద్యునికి ఇద్దామనుకుంటు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాడు

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)