కార్యేషు మిక్సీ, శయనేషు సెక్సీ

🚩ఒకసారి గరికపాటి నరసింహారావు గారికి ఒక అవధానంలో ఆశువు అంశం క్రింద ఒక పృచ్ఛకుడు ఇలా అడిగాడు -


"అవధానిగారూ! కార్యేషు దాసీ కరణేషు మంత్రీ... అంటు ఆడది ఎలా ఉండాలో ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు గదా. దానికి పారడీగా, ఈ రోజుల్లో, భర్త ఎలా ఉండాలని ఆడవారు కోరుకుంటారో ఆశువుగా చెప్పండి".


అప్పుడు అవధానిగారు చెప్పిన ఈ అనేకభాషల శ్లోకం చూడండి:


❤️శ్లో. కార్యేషు మిక్సీ, శయనేషు సెక్సీ


భరణేచ కూలీ, తరుణీషు శూలీ


రూపేచ హీరో, కోపేచ జీరో


షట్కర్మ కర్తా, కలికాల భర్తా.❤️


🚩కలికాలంలో భర్తలు ఈ ఆరుపనులు చేయాలిట -

పనులు త్వరత్వరగా చేయాలి మిక్సీ లాగా;

పడకగదిలో సెక్సీగా ఉండాలి;

సామాన్లు భరిస్తున్నప్పుడు కూలీలాగా ఉండాలి;

ఆడవారి విషయాల్లో భార్యకు సగభాగమిచ్చిన

శివుడు లాగా ఉండాలి;

చూడటానికి సినిమా హీరోలాగా ఉండాలి

; కాని జీరో కోపం ఉండాలి.😄


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)