శ్రీ కాళహస్తీశ్వర శతకము🌷 -ధూర్జటి.🙏 🏵️🏵️



శార్దూలవిక్రీడితము🚩


నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో? స్త్రీ


చన్నో? కుంచమొ? మేక పెంటియొ? యీ సందేహముల్ మాపి, నా


కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే


చిన్నీరేజ విహారమత్త మధుపా! శ్రీకాళహస్తీశ్వరా!


🏵️🏵️🏵️🏵️🏵️


👉🏿ప్రభో శ్రీకాళహస్తీశ్వరా!


మోకాలో (అర్జునునికి శ్రీకృష్ణుడు తన మోకాలిని చూపి అందు


శివలింగమును గాంచమనినది),


స్త్రీ యొక్కస్తనమో (ఒక మహారాజు వేశ్యాలోలుడయ్యి కూడా వేశ్య


స్తనములో శివున్ని చూసినట్టు),


కుంచమొ (కుంచేశ్వరుడు అని పేరు ఆ లింగమునకు),


మోకపెంటియో (కోటయ్య అను గొల్లవాడు మేకపెంటికను


శివలింగాకృతిగా భావించి పూజించగా అది కోటేశ్వరలింగముగా


మారినట్లు)


నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును?


నా యీ సందేహములన్నియు పోగొట్టి నీ సగుణమూర్తిని


నాకు చూపి ధన్యుని జేయుము ప్రభో.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)