🏵️కుటుంబ కధలు!


·

కూతురిగా తల్లి తండ్రుల మీద ఉన్న మమకారం అత్తామామల

మీద కూడా ఉంటె ఎక్కడ వృద్ధాశ్రమాలు ఉండవు.

కొంతమంది మనసు నోచుకోవచ్చు కానీ ఇది నిజం.

నన్ను రాసిరంపాన పెట్టిన ముసలిదాన్ని నేను చూసేదేంటి అని చాల మంది కోడళ్ల వాదన.

రేపు నువ్వు నీ కోడల్ని కళ్ళలో పెట్టి చూసుకున్న కూడా నీ కోడలు నీ చివరి రోజుల్లో నీకు ముద్ద పెట్టొద్దని నమ్మకం ఉందా?

ఇక్కడ ఎదుటివాళ్ళు మనకేమి చేశారనేది ముఖ్యం కాదు.

మనం ఏంటి ? అన్నదే ముఖ్యం.

బిడ్డ తల్లి పాలు తాగేప్పుడు కాలితో తంతు ఆడతాడు. ఆ మాత్రం దానికి వాడు మనల్ని కాలితో కొట్టి అవమానించిందని కాదు.

బిడ్డకి పసితనం లో లోకం తెలియనట్టు కొందరికి వయసులో ఉన్నప్పుడు స్పృహ ఉండదు. ఆ టైం లో మిమ్మల్ని హింసించి ఉండవచ్చు ప్రతిగా మీరు ఆలా చేస్తే మీకు, వాళ్ళకి తేడా ఎం ఉంటుంది చెప్పండి

. రోడ్డున పోయే ముసలొల్లు అడుక్కుతింటుంటే చూసే మనకి గుండె తరుక్కుపోతుంది.

మరి మన ఇంటి వాళ్ళే రోడ్డున పడితే ఊహించుకోగలమా ?

భార్య భర్త లో, భర్త భార్యలో సగ భాగం అంటారు కదా, అంటే నీ భర్తకి తల్లితండ్రులు నీకు తల్లితండ్రులనేగా అర్ధం.

మరి నీ తల్లితండ్రులని నువ్వు ఎలా ఈసడిస్తున్నావ్?


మనం పీజీ లు , డాక్టరేట్లు చదవక్కర్లేదు ఇంట్లో వారి మనసుని,


పరిస్థితిని అర్ధం చేసుకుంటే చాలు.

ఇట్లు

మీ కుటుంబ సభ్యులు

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!