🔻తెలుగు కన్య .🔻

🔻తెలుగు కన్య .🔻

✍️సీ. కబరీభరమునకుఁ గందంబు సెల్లు, ను

త్పలమాలికలు నేత్రములకుఁజెల్లు

గర్ణంబులకును మంగళమహశ్రీ సెల్లు

గాత్రంబునకుఁ జంపకంబు చెల్లు

మధురవాగ్వ్రత్తికి మత్తకోకిల చెల్లుఁ

జనుగుబ్బకవకు మంజరియుఁ జెల్లు

బిరుదైన పిఱుఁదునకుఁ బృథివివృత్తము చెల్లు

మధ్యంబునకుఁ దనుమథ్య చెల్లు

.

తే. పాదముల కంబుజము చెల్లుఁ బరఁగు నడకుఁ

దనరు మత్తేభవిక్రీడితంబు సెల్లు

గృతుల వర్ణింపఁదగు తదాకృతులె కృతులు

వాంఛచే దానిఁ బొందిన వాఁడె సుకృతి

.

(అయ్యలరాజు నారాయణామాత్య "హంసవింశతి" నుండి.)

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)