🔻సీతా రాముల సరస సల్లాపం !🔻

🔻సీతా రాముల సరస సల్లాపం !🔻


🚩దశరధుడు పుత్రకామేష్టి చేసి ముగ్గురు భార్యలచేత పాయసం

తినిపించాక వారికి సంతానం కలగడం అన్న విషయాన్ని

దృష్టిలో పెట్టుకుని, 'పాయసం తాగినంత మాత్రాన పిల్లలు పుట్టేస్తారా?" అని సరదాగా సీత రాముడితో అన్నదట.

దానికి రాముడు, "ఆ! పొలం దున్నుతుంటే కూడా పిల్లలు దొరుకుతారులే" అని చమత్కరించి నవ్వాడట.

అవును! సీత పొలం దున్నుతుంటే భూమిలో కనపడిందిగా!🚩


🚩దీనికి మూలం తెనాలి వారి పద్యం .

బలరాముడు సీతను చూసి ఫక్కున నవ్వెన్" అనే సమస్యను

శ్రీ కృష్ణ దేవరాయలు ఇవ్వగానే, దానికి తెనాలి రామకృష్ణుడు చెప్పిన సమాధానం బహుళ ప్రాచుర్యం పొందింది.

"బలరాముడు సీతను చూసి నవ్వడమేమిటి"? అదే సమస్య..బలరాముడు అన్న పదానికి ముందు

"ధీ" అన్న అక్షరం చేరిస్తే "బుద్ధి బలం గల రాముడు" అని అర్థం మారుతుంది. అలా అర్థాన్ని మార్చి పద్యాన్ని అర్థవంతం చేసాడు

✍️

""లలనలు పాయసమానిన


కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వన్


పొలమున దొరికెదరని ధీ


బలరాముడు సీత జూచి ఫక్కున నవ్వెన్"✍️


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)