Posts

Showing posts from January, 2024

🚩🚩-*"కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి".....

Image
  #కంటికెదురుకానీకలికి చిలకల కొలికి మాకు  మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి) #అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు  ఎరుగని  పసి  పంకజాక్షి మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి) #ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి నేటి అత్తమ్మా నాటి  కోడలివే తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి) #మసకబడితే నీకు మల్లెపూదండ తెలవారితే  నీకు  తేనే నేరెండ ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మల పంట మా అత్త చాలు పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి) * "కలికి చిలకల కొలికి" పాట ఆడవాళ్ళ హృదయాలనే కాదు అందరి హృదయాలను కదిలుస్తుంది.  రాసిన తీరు చూస్తె అందరిని సున్నితం గా మందలించటమే కాదు, ఒక కోడలు ఎలా ఉంటుందో, ఆమె అత్త వారింట్లో పడే కష్టం, పుట్టింటి కోసం వాళ్ళు ఎప్పుడు ఎలా ఎదురు చూస్తారో త

🚩🚩*"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు *"అంటున్న బాపు గారి కోపగించిన కృష్ణుడు .

Image
  🚩🚩*"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు *"అంటున్న బాపు గారి కోపగించిన కృష్ణుడు . సీ. *కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ నుఱికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బైనున్న పచ్చని పటము జాఱ నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ తే. *గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. *కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటూ సాగే పద్యం పోతన రచించిన శ్రీమదాంధ్రమహాభాగవతం లోనిది. భాగవతంలోని ఈ పద్యం మరో నాలుగు పద్యాలతో పాటు భీష్మస్తుతిగా పేరొందింది. *కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ ను, అర్జునుడిపైన ఉన్న వాత్సల్యంతో, పక్కనపెట్టి తనను చంపేందుకు దూకిన కృష్ణుణ్ణి భీష్ముడు వర్ణిస్తూ స్తుతిస్తున్న సందర్భంలోని పద్యం ఇది.

-🚩-*మీసాల పురాణం .!!

Image
-🚩-*మీసాల పురాణం  .!!                  🚩 *మీసమును ప్రేమించుమన్నా…*       **మీసమంటే జుట్టు కాదోయ్, మీసమంటే పురుషుడోయ్!**                                 🥰🥰🥰                 👌*నవరసాలూ, మీసాలూ – హాస్యము*👌 🚩 #వేషము వేసి పంపితివి వేదికమీదకు, పాడువేళన మీసము లూడిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ హాసము చేయుచుండిరి; రహస్యముగా తెరవేయుమంచు నీ కోసము చూడగా కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో! – #కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు (*దుర్యోధనుడి పాత్రలో గంభీరంగా నటించే నటుడొకరు పద్యం  పాడేటప్పుడు అనవసరంగా మీసాలు పదేపదే మెలివేసేసరికి అవి కాస్తా  ఊడిపడ్డాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వసాగారు. చేసిన తప్పు  దిద్దుకోవడానికి ఒకసారి తెరదించమని దర్శకుణ్ణి కోరితే కస్సుమని  తారామండలం స్థాయిలో లేచాడట. అతిగా ఎందుకు చేశావని.) 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 🚩🚩*మినుకుచేడి కృప మొలిచె మీసములుగ🥰 *గురజాడ మీసమ్ము గురువుయై భాసిల్లు ఆదిభట్ల గరిమ హరికథలకు నారసింహ త్రయము నవ్వుల రేడులు గుబురు మీసాలతో గురుతుగాను చెళ్ళపిళ్ళ కవికి సింగార మొప్పంగ నండూరి కవి పూల చెండు వోలె దువ్వూరి జాషువా తోడు కోయిలలుగా సరిగ త్రిపురన