🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)
🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy) ♦️ ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు సమున్నత స్థానం ఉంది. కృతి కర్తగా #అల్లసాని వారికి అలాగే కృతి భర్తగా కృష్ణరాయలకు ఆ కావ్యం అజరామర కీర్తి ప్రతిష్ఠలను అందించింది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను వర్ణనా చాతుర్యంతో మహాప్రబంధంగా తీర్చి దిద్దిన మహాకవి అల్లసాని. అల్లసాని వారు తన గురువు శఠగోపయతి వద్ద "అజప" దీక్ష తీసుకున్నవాడు. ఇది ఎవరి కథ: ఈ ప్రభంధం స్వారోచిష మను సంభవాన్ని గూర్చి చెప్పబడింది. స్వారోచిషుడు రెండవ మనువు కాగామొత్తంగా 14 మంది మనువులు ఉన్నారు. కథగా చెప్పుకోవలసి వస్తే..... #ప్రవరుడు అందమైన యువకుడు. అతిథి సేవా తత్పరుడు. ఒకనాడు ఒక సిద్ధుడు ప్రవరుని ఇంటికి వస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన ప్రవరుడాతనిని తాను తిరిగిన ప్రదేశాలలలోని విశేషాలను చెప్పమని కోరడం, సిద్ధుడు చెప్పడం జరుగుతుంది. చిన్న వయసులో ఇన్ని ప్రదేశాలను చుట్టిరావడమెలాగా అనే ప్రశ్నను ప్రవరుడు వేయడం, దానికి సిద్ధుడు తన దగ్గర ఉండే పసరు మహిమను చెప్పడం జరుగుతుంది. ఆ పసరును అడిగి కాలికి పూయించుకున్న ప్రవరుడు హిమాలయాలను దర్శించడం, ఆ నీటికి పసరు కరగిపోవడం, అక