🔻 # కృష్ణ గణపతి.🔻
♦బ్రహ్మ వైవర్త పురాణంలో గణపతి ఖండమను అధ్యాయమున్నది .దానిలో గణపతి చెందిన పెక్కు విషయాలున్నవి . కృష్ణ పరమైన ఆ పురాణంలో గణపతి కృష్ణుని అంశలోనే జన్మించినట్లు చెప్పబడింది . పార్వతి పుత్రకాంక్షతో శివునితో కూడ రతి క్రీడలో వున్న సమయంలో దేవతలు రతి గృహ ద్వారం వద్దకు వచ్చి మొరపెట్టుకొన్నారు. ♦సంభోగ మధ్యమున వెలుపలికి వచ్చిన శివుని వీర్యం భూమిపై పడింది .దానివల్ల షణ్ముఖుడు అవతరించాడు. కానీ పార్వతికి తనకు సంతానము కలుగ లేదన్న వ్యధ ప్రారంభమయింది . శ్రీ కృష్ణుని సూచన మేరకు శివుడు పుత్రప్రాప్తి కొరకు పుణ్యక వ్రత మాచరించునట్లు చెప్పినాడు .ఆ వ్రతాన్ని చేసిన తరువాత శ్రీ కృష్ణుడు గోప కిశోరరూపమున ఆమెకు దర్శన మిచ్చినాడు. కోటి కందర్ప లావణ్య మనోహరుడగు కృష్ణుని వంటి పుత్రుడు తనకు కావాలని ఆశించి యిష్టార్ధ సిద్ధిని పొందింది . తరువాత పుత్రాకాంక్షతో పరమ శివునితో రతి క్రీడలో నున్న సమయంలో విష్ణువు మాయరూపంలో వచ్చి ద్వారం వద్ద నిలిచి ‘భిక్షాందేహి ‘అన్నాడు . మాయా భిక్షువు పలుకులు విన్న శివుడు సంభోగ మధ్యంలో లేవగా అతని రేతస్సు అట్లే శయ్య పడెను.శివపార్వతులు ఖిన్న వదనులై వెలుపలికి వచ్చి గృహస్థ ధర్మము మేరకు ఆ బ్రాహ్మణుని సత్