🚩ఆకాశవాణి .!
ఆకాశవాణి .! ఉదయం ఆరు గంటలకు *ఆకాశవాణి... విజయవాడ కేంద్రం* ఇప్పుడు *సమయం* (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు. రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు! రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి. 4 గంటలనుండి *మంగళ స్నానం* చేసుకునే సమయంలో *మంగళ వాయిద్యాలు* (సన్నాయి) ప్రసారం చేసేవారు. ఆరు గంటలకు పుష్పాంజలి మొదలయ్యేది. ఆదివారం నాడు 'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...', సోమవారం నాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా' అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో! 7 గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నారే" మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...' అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో... ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... 'కార్మికుల కార్యక్రమం'. చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్