Posts

Showing posts from August, 2022

ప్రసిద్ధి పొందిన పద -పల్లవాలు 🌹

Image
  ప్రసిద్ధి పొందిన పద -పల్లవాలు 1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి 2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’ డా.సి.నారాయణరెడ్డి 3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ - కాళోజి 4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ - నన్నయ 5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ -సుబ్బారావు పాణిగ్రాహి 6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ -బలిజేపల్లి లక్ష్మీకాంతం 7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ -బసవరాజు అప్పారావు 8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ -గుర్రం జాషువా 9. ‘‘అత్తవారిచ్చిన అంటుమామిడితోటనీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ - కాళ్ళకూరి నారాయణరావు 10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ - దాశరధి 11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ -నార్ల వెంకటేశ్వర రావు 12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ - తిరుపతి వెంకట కవులు 13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ - గురజాడ 14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ - గరిమెళ్ళ సత్యనారాయణ 15. ‘‘పరమేశా గం