# ***❤సాంధ్యశ్రీ..(కరుణశ్రీ)*** # ***రచన : కరుణశ్రీ*** # ***సంగీతం : ఘంటసాల***
# ***❤సాంధ్యశ్రీ..(కరుణశ్రీ)*** # ***రచన : కరుణశ్రీ*** # ***సంగీతం : ఘంటసాల*** # ***గానం : ఘంటసాల*** # ***అది సంధ్యా సమయం.*** # ***మల్లె పందిరి పూస్తున్నది.*** # ***కోయిల కూస్తున్నది.*** # ***కవి కుమారుడు కరాలు చాచి,*** # ***కరుణామయుని లాలిస్తున్నాడు.*** # ***01)|| ఉత్పల మాల ||*** # ***అంజన రేఖ , వాల్ కనుల - అంచుల దాట , మనోఙ్ఞ , మల్లికా*** # ***కుంజములో , సుధా, మధుర - కోమల , గీతిక లాలపించు , ఓ*** # ***కంజదళాక్షి !నీ , ప్రణయ - గానములో , పులకింతునా !! మనో*** # ***రంజని ! పుష్ప వృష్టి పయి - రాలిపి , నిన్ , పులకింప జేతునా!!!*** # ***02)|| ఉత్పల మాల ||*** # ***క్రొంజికురాకు వ్రేళుల,కు - రుల్,తడి యార్పుచు గూరుచున్న, అ*** # ***భ్యంజన మంగళాంగి , జడ - లల్లుదునా ! మకరంద , మాధురీ*** # ***మంజుల , మామక , ప్రణయ - మానస భావనలే , ప్రపుల్ల పు*** # ***ష్పాంజలి జేసి ,నీ అడుగు - లందు , సమర్పణ జేసి కొందునా!*** # ***03)|| ఉత్పల మాల ||*** # ***ఓ.......ఒ..ఒ..ఓ...........ఒ...ఒ...ఓ.....*** # ***సంజ వెలుంగులో , పసిడి - ఛాయల , ఖద్దరు చీర గట్టి, నా*** # ***రింజకు నీరు వోయు ,శశి - రేఖవె నీవు ! సుభద్ర సూతినై*** # ***