🍂☘-శర్మ కాలక్షేపం కబుర్లు-☘🍂 ♥మన కన్నా ...అదృష్ట వంతులు ఎవరూ ??
🍂☘-శర్మ కాలక్షేపం కబుర్లు-☘🍂 ♥మన కన్నా ...అదృష్ట వంతులు ఎవరూ ?? 1940 – 1960 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇదిమనకోసం.. వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమేచాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళుస్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే. మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం. రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం. అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం. VCR ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే.. అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం.. సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే. మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం. స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు