కిన్నెరసాని కథ 🌹
కిన్నెరసాని కథ 🌹
🚩#తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి
అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’.
ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది.
ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది.
వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు
#తెలం గాణ ప్రాంతంలోని ‘గుండాల’ అడవుల్లో ‘వుర్కోడు’ దాని జన్మస్థలం. అడవులు గుట్టలు గుండా ప్రవహిస్తూ పాల్వంచ సమీపంలోని ‘యానంబయలు’ గ్రామం వద్ద ఒక గుట్టను పెనవేసుకున్నట్టు ప్రవహిస్తుంది. అక్కడే 1966లో జలాశ యం నిర్మించారు. అక్కడి అడవితల్లి ప్రకృతి సోయగాలు కిన్నెరసాని సొగసులు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం వెరసి పర్యాటకులకు కన్నుల పండుగే!!
జలాశయం దాటిన కిన్నెరసాని ప్రవాహం రాతి తోగుల గుండా ఇసుకతెప్పలు మీదుగా సాగి భద్రాచలం సమీపం లోని భూర్గంపాడు వద్ద గోదావరి ఒడి చేరుతుంది.
ఇక విశ్వనాథవారి ఊహాకావ్యంలో కిన్నెరసాని ఒక తెలుగింటి కోడలు. భర్తను మనసుతో ఆరాధించిన మహాపతివ్ర త. తన దుఃఖాన్ని పోగొట్టుకునే శక్తిలేని ‘ఉద్విగ్నహృదయిని’. తన భర్త కూడా అంతే అనురాగవంతుడు. కాని తల్లి తన భార్యపై వేసే నిందలకుగాని, ఆమె పెట్టే ఆరళ్లకుగాని ఎదురు చెప్పలేని తల్లి బారి నుంచి భార్యను కాపాడుకోలేని ద యాహీనుడు అతడు. చివరకు అత్తగారు పెట్టే ఇబ్బందులు భరించడం కిన్నెరసానికి కష్టైమెంది. కళ్లతో గాక హృదయం తో దుఃఖిస్తుంది. ఆమె భర్త అటు తల్లిని కాదనలేడు, ఇటు భార్యను ఓదార్చలేడు.
నిస్సహాయ స్థితిలో కిన్నెరసాని అడవుల వెంట పరిగెడు తూ అత్తింటి కష్టాలకు దూరంగా పారిపోతుంది. భర్త తనను విడిచి ఎక్కడకూ వెళ్లవద్దని తను కూడా ఆవెువెంట వచ్చి వె నుక నుంచి పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తాడు. వేణీబంధా న్ని పట్టబోతే నీరైతాకింది. చీరకొంగు పట్టబోతే అదీ నీరై తగిలింది. వాగు కనుక అది నీరే. కాని వాగును స్త్రీగా మాననీకరించి, ఆ స్త్రీ దుఃఖంతో నీరైందని చెప్పడంలో విశ్వనాథ వారి భావనాశీలత అగుపిస్తుంది.
చివరికి కిన్నెర భర్త కౌగిలిలో కరిగి నీరై ప్రవహించింది. భర్త భార్య కోసం శోకించి చివరికి శిలగా మారిపోతాడు. తన కౌగిలి నుంచి జారి వాగుగా మారిపోయి వేగంగా సాగిపోతున్న కిన్నెరను చూసి ఆమె భర్త దుఃఖిస్తూ ఆమెను పిలవడంతో కథ మొదలవుతుంది.
#కిన్నెర మానవత్వం నుండి నదీత్వం పొందింది. ‘నాయిక నదిగా మారడవేు’ ఇందులోని చమత్కారం. నదిగా మారిన కిన్నెరసాని జలలక్షణాలతో ప్రవహిస్తుంది. కాని తన హృదయరేడు అయిన భర్తను విడువలేక గుట్టగా మారిపో యిన భర్తను భారంగా చూస్తూ వెనక్కి తిరిగి తిరిగి పరికిస్తూ ముందుకు పరుగులు తీసింది. అప్పుడే తనలోని సహజలక్షణాైలెన నృత్యం - సంగీతం వ్యక్తీకరణలు మొదలై, వీనులవిైందెన కిన్నెరసాని గానం వెలువడుతుంది. దూరాన గల సముద్రుడు పారవశ్యంతో పరవశించి నదీరూపంలో గల ‘కిన్నెర’’ రాక కోసం అనురాగంతో పరితపిస్తాడు.
#నదీరూపం దాల్చిన కిన్నెర గుణం చేత మహాపతివ్రత సముద్రం ఆరాటపు పొంగును చూసి దిగులుపడి తనలోతా నై ఏడ్చింది. అంతలోనే తెలివి తెచ్చుకుని సముద్రుని భార్య అయిన గోదావరి ఒడిలో మాతృప్రేమ కొంగున కట్టుకుని చేరి అమ్మను చేరిన కూతురిలా తృప్తి చెందింది. అలా గోదారమ్మను చేరిన ‘కిన్నెరసాని’ శాంతించి దుఃఖానికి దూర మైంది. నిత్యం భద్రాద్రి రాముని పాదపూజలో భాగమై రామభక్తులకు చల్లని నీడ - నీరు అందిస్తూ పుణ్యవతిగా అలరారింది అంటూ కిన్నెరసాని పాటలకావ్యం పరిసమాప్తి చేస్తారు విశ్వనాథ సత్యనారాయణ..
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Comments
Post a Comment