🌹 #ఆదుర్తి_సుబ్బారావు – #మనసులను_తాకిన_మధురదర్శకుడు .!
#ఆదుర్తి_సుబ్బారావు – #మనసులను_తాకిన_మధురదర్శకుడు * 1955 నుంచి 1970 వరకూ తెలుగు సినీరంగంలో ప్రేక్షకులను పదే పదే థియేటర్లకు రప్పించిన దర్శకుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆదుర్తి సుబ్బారావుగారే. రాజమండ్రి సత్తెన్న గారి సిన్నబ్బాయి అయిన ఆయన, నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ వ్యక్తి. బాల్యం – విద్య 1922 డిసెంబర్ 16న రాజమండ్రిలో జన్మించారు. అసలు పేరు ఆదుర్తి వెంకట సత్య సుబ్బారావు, ఇంట్లో చిట్టిబాబు అని పిలిచేవారు. చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి చూపిన ఆయన, తండ్రి అడ్డుకున్నా, 1943లో బాంబే వెళ్లి మూడు సంవత్సరాలు ఫిల్మ్ ల్యాబ్ ప్రాసెసింగ్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ కోర్సులు చేశారు. తిరిగి మద్రాసు చేరి ఉదయశంకర్ ట్రూప్‌లో, తరువాత కె.ఎస్. ప్రకాశరావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. *సినీరంగ ప్రవేశం 1954లో “అమరసందేశం” చిత్రాన్ని నిర్మించడం ద్వారా తొలి అడుగు వేశారు. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఆప్తుడై, అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆయన దర్శకత్వంలో 36 సినిమాలు, అందులో 10 హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. *అవార్డులు – గౌరవాలు 7 జాతీయ అవార్డులు (6 తెలుగు, 1 తమిళం) 3 ...