శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం.
“భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు. పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”. భా రతీయులను అనేక బాధలకు, అవమానాలకు గురిచేస్తున్న ఆంగ్లేయుల దౌర్జన్యాలనూ, కుటిల రాజనీతిజ్ఞతనూ, దోపిడీ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో 5 రోజులపాటు ఇచ్చిన ఉపన్యాస సారాంశానికి చిలకమర్తి ఇచ్చిన పద్యరూపమే ఇది. భారతీయతను పుణికిపుచ్చుకుంటూ ఆంగ్ల పాలకులపై నిప్పులు చెరిగిన కలం ఆయనది.”భరతఖండంబె యొక గొప్ప బందిఖాన” అంటూ నాటి దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినవాడు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకరు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26న పశ్చిమ గోదావరి జిల్ల