పుల్లంపేట జరీచీర🌹 (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి) 🏵️🏵️🏵️🏵️🏵️
పుల్లంపేట జరీచీర🌹 (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి) 🏵️🏵️🏵️🏵️🏵️ యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమస్తాగా వుండినప్పటి సంగతి ఇక నెలా పదిహేను రోజులుందనగా, సంకురాత్రి పండక్కు రాధమ్మని పుట్టింటివారు తీసుకువెళ్ళరని తేలిపోయింది. అప్పటిదాకా పద్దెనిమిదేళ్ళ పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు. దగ్గిరగా వున్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు, కానీ నెల్లూరికీ, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి. ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది. ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది; కాని వొక్కక్షణంలో తేరుకుని, ఆమె కళ్ళలోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు. తరువాత 'మడి కట్టుకోండి' అంటూ ఆమె వంటి