Posts

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

Image
  - #కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !! * 'ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?', 'ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉందిగా', *'ఉద్దండపండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయా',* 'పెళ్లి పెద్దలంటూ శుద్ధమొద్దులు తయారయారు', *'ఉన్నమాటైనా సరే ప్రభువుల ఎదుట పరులను పొగడరాదు'* , +'చేతులు రాక కాదు - చేతకాక అని చెప్పు', ఇలాటి కోటబుల్‌ కోట్స్‌ మాయాబజారు నిండా ఎన్నో వినబడతాయి. ఇవన్నీ సామెతల స్థాయికి ఎదిగిపోయాయి. 'మాలో గోటు అంటే గొప్ప అని అర్థం పండితులు తమకైనా తెలియదుటండీ' అని చినమయ అనగానే వెంటనే ఈ పండితుడు 'ఆ పై మాట నేను చెబుతా, తీట అంటే గౌరవం అంతేగా!' అంటాడు. పండితులను ముఖస్తుతితో ఎలా బోల్తా కొట్టించాలో గొప్ప ఉదాహరణ. 'పెళ్లి సందడిగా జరిపిస్తాన'ని కృష్ణుడు వదినగారికి మాట ఇస్తాడు. ఎలా కావాలంటే అలా అన్వయించుకునే వీలుంది. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ జనజీవితంలో భాగంగా అయిపోయాయి కూడా ! ఇదివరకు ఏదైనా గొప్పపని చేస్తే 'మెచ్చి మేకతోలు కప్పడం...