🔴- నల్లనయ్యా మన మనసు దోచేడు వాడు .-🔴


🔴- నల్లనయ్యా   మన మనసు దోచేడు వాడు .-🔴

( పోతన గారి  పద్య రాజములు..)

#నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ

జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా

జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!

మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే! ❤

♦నల్లని దేహము వాడు, కమలములవంటి కన్నులు గల వాడు, కరుణా రసము కురిపించే వాడు, సిగపై నెరపిన నెమలి పింఛము కల వాడు, చిరునవ్వు చెలువారే చక్కని మోము కల వాడు నైన ఓ కుర్రవాడు మా మానినీమణుల మానధనం దోచి తెచ్చాడు. ఓ మల్లెలార! మీ మల్లె పొదల మాటున కాని ఉన్నాడేమో కొంచం చెప్పండమ్మా.

♦తమతో క్రీడిస్తున్న గోపాలకృష్ణుడు కనుమరుగు కాగా తదాత్మకత్వమున పరవశులైన గోపికలు కృష్ణుని వెతుక్కుంటున్నారు. కనిపించిన చెట్టుచేమ అన్నిటిని అడుగుతున్నారు. భాగవతంలో అత్యద్భుతమైన పద్యాలలో ఎన్నదగినది యిది. 

♦దీని కవల పద్యం అనదగ్గది, దీనికంటె ప్రసిద్ధమైన పద్యం ఇదే వృత్తంతో ఇదే శైలితో ఇలాంటి పదాలతోనే “నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు. . .” అని మరొక పద్యం నవమ స్కంధంలో (9-361-ఉ.) రాముని ఉద్దేశించిన పద్యం ఉంది.

https://www.youtube.com/watch?v=jLXrkLT_UgI&t=40s 

9-361

#నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్

విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ

జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం

జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్...

భా. 9-361-ఉ.

♦నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించువాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)