❤️ఆ మూత గట్టిగా బిగించండి! * జోక్❤️
🚩
పరమ గయ్యాళిగా పేరుపడిన శ్యామూల్ రాజు భార్య చనిపోయిందని శవపేటికలో తీసుకెళ్తున్నారు. శ్మశానానికి చేరుకునేంతలో శవపేటిక మూత ఊడింది. దాన్ని బిగించ బోతుండగా చిన్నగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినబడింది.
తీరా చూస్తే ఆవిడ కొనూపిరితో ఉంది. పొరబాబు గ్రహించి ఆమెను మళ్ళీ వెనక్కి తెచ్చారు. ఆ తర్వాత ఒక ఐదేళ్ళు బతికి ఓరోజున కాలం చేసింది. మళ్ళీ ఆమె శవాన్ని శవపేటికలోకి చేరుస్తున్నారు. గొంతు సవరించుకుని పనివాళ్ళతో శ్యాముల్ రాజు అన్నాడు... "ఆ తలుపు చెక్కలు కాస్త గట్టిగా బిగించండి😀

Comments
Post a Comment